హైదరాబాద్, జనవరి 4 (విజయక్రాంతి): వైద్యరంగంలో అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఇపియాన్ కో ఫౌండర్, పెయిన్ స్పెషలిస్ట్ కన్సల్టెంట్ డాక్టర్ మినల్ చంద్రకు దక్షిణ భారత మహిళా అచీవర్స్ అవార్‌ె్డ 2024 దక్కింది. వివిధ రకాల సంక్లిష్ట నొప్పులకు ఆధునిక సాంకేతికతను జోడిస్తూ మెరుగైనా చికిత్సనందిస్తున్నందుకు ఈ అవార్డుకు డాక్టర్ మినల్ చంద్ర ను ఎంపిక చేసినట్టు నిర్వాహకులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. హిందుస్థాన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ స్థానాన్ని దక్కించుకున్నట్టు చెప్పారు. ఈ అవార్డు తనకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు.