calender_icon.png 16 April, 2025 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డా. బి‌ఆర్ అంబేడ్కర్ 134వ జయంతి వేడుకలు..

14-04-2025 06:20:48 PM

జియమ్. షాలం రాజు..

కొత్తగూడెం (విజయక్రాంతి): కొత్తగూడెం ఏరియా ఏరియా రుద్రంపూర్ లో సోమవారం  భారతరత్న బాబాసాహెబ్  డా. బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలేం రాజు ముఖ్యఅతిథిగా పాల్గొని రుద్రంపూర్ మార్కెట్ ఏరియా లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో  నివాళులర్పించారు. అనంతరం సింగరేణి ఎస్‌సి & ఎస్‌టి అసోసియేషన్ లైసన్ ఆఫీసర్స్, అసోసియేషన్ సభ్యులు, పెద్ద మొత్తంలో హాజరైన అంబేడ్కర్, అభిమానులు ఘజమాలలతో  అలంకరించారు. కొత్తగూడెం ఏరియాలోని అన్ని గనులు, డిపార్ట్మెంట్లలో డా. బి‌.ఆర్. అంబేడ్కర్ 134వ జయంతి వేడుకలను నిర్వహించారు. అనంతరం  మార్కెట్ ఏరియా నందు సెంట్రల్ ఫంక్షన్ హల్ లో వ్యాస రచన పోటీలు నిర్వహించి  ఉత్తమ వ్యాస రచనలను ఎంపిక చేసి వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జి‌ఎం తో పాటు, సంబంధిత అధికారులు, సిబ్బంది, యూనియన్ నాయకులు విశ్లేషకులు, విద్యావేత్తలు, కార్మికులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.