14-04-2025 08:33:49 PM
బచ్చన్నపేట (విజయక్రాంతి): బచ్చన్నపేట మండల కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్134 జయంతిని విగ్రహ ప్రతిష్టాపన కామీటి అధ్యక్షులు కంత్రి సత్తయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు కుల సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడుతూ... సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, హక్కుల సాధనకు చేసిన కృషి చిరస్మరణీయడు అంబేద్కర్ అని కొనియాడారు. రాజ్యాంగ రచనలో కీలకపాత్ర పోషించారని, ఆయన కృషి కారణంగానే ప్రపంచంలో భారతదేశం బలమైన ప్రజాస్వామ్యం దేశంగా ఆవిర్భవించిందని అన్నారు.
అంబేద్కర్ అణగారిన వర్గాలను రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేశారన్నారు. న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా, సంఘ సంస్కర్తగా పేరొందారన్నారు. స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్ విధులు నిర్వర్తించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలని భావించిన తొలి వ్యక్తి అంబేద్కరన్నారు. అంబేద్కర్ జీవితం ఉద్యమాలకు, సాంఘిక సంస్కరణలకు ఊపిరిపోసిందన్నారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను గుర్తిస్తూ...1990లో అప్పటి భారత ప్రభుత్వం దేశ అత్యున్నత అవార్డు భారత రత్నను ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. 1891 ఏప్రిల్ 14న జన్మంచిన అంబేద్కర్ సేవలు, పట్టుదల, పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఎంతో ఆదర్శమన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అంబేద్కర్ రాజ్యాంగ రచన కారణంగానే భారతదేశం సురక్షితమైన పాలకుల చేతిలో ఉందన్నారు. నిరంకుశ పాలకుల కోరలను పీకే ఓటు అనే వజ్రాయుధంతో శక్తిని ప్రజలకు అంబేద్కర్ ఇచ్చారన్నారు. అంబేద్కర్ వేసిన బాటలో నా డవలసిన అవసరం ఎంతైనా ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు పైసా రాజశేఖర్, ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి, మల్యాల అఖిల్ తమ్ముడి మహేందర్, స్వరాజ్, సిరిపాటి రాందాస్, చింతల కర్ణాకర్, పంచాయతీ సెక్రెటరీ నరసింహ చారి ,కాంగ్రెస్ పార్టీ నాయకులు, నల్లగొని బాలకిషన్ గౌడ్, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్, టిడిపి రాష్ట్ర నాయకులు అల్లాదుర్గం వెంకటేష్,జిల్లా సందీప్,గుర్రం బాలరాజు,విహెచ్పిఎస్ మండల నాయకులు అల్వాల స్వామి,కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు బొమ్మర్ల వేణు వందనం, బుర్ర బాలమణి, యాదగిరి,తురక్కపల్లి శ్రీనివాస్, కిష్టయ్య, అలవాల రమేష్, కర్ర నరేష్, మట్టి బాలరాజ్, తదితరులు పాల్గొన్నారు.