14-04-2025 03:18:06 PM
బీజేపీ నాయకులు సంజీవరావు
మందమర్రి,(విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాల సాధన బీజేపీతోనే సాధ్యమవుతుందని ఆయన ఆశయాల మేరకు బిజెపి ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని బిజెపి సీనియర్ నాయకులు దేవర నేని సంజీవరావు అన్నారు. మండలంలోని ఆదిల్ పేట గ్రామంలో అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాల లు వేసి నివాళులు అర్పించా రు. అనంతరం ఆయన మాట్లాడారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తుందని దానికి ఉదాహరణగా ఆర్టికల్ 370 అని స్పష్టం చేశారు. భారతదేశ ఫలాలను అన్ని వర్గాల వారికి అందే విధంగా రాజ్యాంగాన్ని రచించారని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు గిర్నాటి జనార్ధన్, అంబేద్కర్ జయంతి ఉత్సవ కన్వీనర్ కర్రే రాజయ్య, యువ మోర్చ మండల అధ్యక్షులు పెంచాల రంజిత్, పెద్దల మారుతి, మాజీ వార్డు సభ్యులు ఎనగందుల రాజయ్య, నాయకులు దుర్గం మల్లేష్, దారవేని రవికుమార్, బోర్లకుంట లక్ష్మణ్ లు పాల్గొన్నారు