14-04-2025 03:11:53 PM
మందమర్రి,(విజయక్రాంతి): భారత రాష్ట్ర సమితి (బిఆర్ ఎస్) ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని ఆదిల్ పేట్ గ్రామంలో భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహనికి పులమాలలు వేసి నివాళులు అర్పించారు. అనం తరం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాజీ జెడ్పిటిసి సభ్యులు వేల్పుల రవి మాట్లాడారు. స్వేచ్ఛ, సమానత్వం కోసం, బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని ఆయన సేవలను కొనియాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం, అంబేద్కర్ ఆశయాల కోసం నిరంతరం కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు గుర్రం శ్రీనివాస్ గౌడ్, నజీర్, ఫిరోజ్, సంకె శ్రీనివాస్, జంపయ్య, అడప రాములు, పెంచాల మధు, రవీందర్ రావు, రాజారాం, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు