డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడుచుకోవాలి
డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క...
కూకట్ పల్లి (విజయక్రాంతి): దేశానికి అంత్యంత ప్రేరణనిచ్చిన మహానుభావుడిని స్మరించుకొవాడం గర్వకారణం అన్నారు. డా.బి ఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలో భారతదేశంలోని ప్రతి ఒక్కరు అనుసరిస్తున్నారని తెలంగాణ డిప్యూటి సి.ఎం. మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం డా.బి అర్ అంబేథ్కర్ వర్ధంతిని పురష్కరించుకొని కూకట్ పల్లి జె.ఎన్.టి.యు.హెచ్ లో డా.బి ఆర్ అంబేద్కర్ మహాపరి నిర్వాహన దివాస్ ఈ కార్యక్రమానికి అయన ముఖ్య అతిథిగా హాజరై పాల్గోన్నారు. ఈ సందర్బంగా అయన విగ్రహానికి, చిత్రపటానికి పూల మాలవేసి నివాలర్పించారు. అనంతరం అయన మాట్లాడుతూ.. బి.ఆర్ అంబేధ్కర్ వంటి గొప్ప వ్యక్తి మన ధేశంలో పుట్టడం మన అందరి అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ప్రపంచంలో అద్బుతమైన మేధావి డా.బి ఆర్ అంబేద్కరేనని అనేక దేశాలు ప్రకటించాయన్నారు.
ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని అందించారన్నారు. అనేక రాజ్యాలలో రాచరిక వ్యవస్ధలలో రాజుకి ప్రజలకు విపరీతమైన వ్యత్యాసం ఉన్నటువంటి రాచరిక వ్యవస్థ నుంచి ఈ దేశాన్ని పూర్తి స్థాయిలో ప్రజాసామ్య దేశంగా మార్పుకు నాంది పలికారని అయన అన్నారు. ఈ దేశానికి తొలి ప్రధాని నవ భారత నిర్మాత పంచవర్శ ప్రణాళికతో మిశ్రమ అర్ధిక విధానాలతో పునాదులు వేసి ఈ దేశ స్వతంత్య్రం కోసం పోరాటం చేసిన గోప్పవాల్లు అందరు కలిసి ప్రజాసామ్యానికి పునాది వేసారు. గొప్పగొప్ప నాయకుల మధ్యలో డా.బాబా సాహెబ్ అంబేద్కర్ జీవితాన్ని మనం నెమరవేర్చుకుంటున్నామన్నారు. అంబేద్కర్ జీవితంలో ఎదుర్కొనటువంటి అనేక సంఘటనలు, సందర్బాలలో సానుకూలంగా స్పందించారు. సామన్య బాలుడు పాఠశాలకు వెళ్ళి అందరితో కూర్చోలేక బయటికి పంపిస్తే బయట కూర్చొని పాఠాలు విని ఎక్కడ కూడా అవమానానికి గురి కాకుండా పంతంతో కూర్చొని పాఠాలు నేర్చుకున్న గొప్ప మహనీయులు డా.బి ఆర్ అంబేద్కర్ అని అన్నారు. అటువంటి వ్యక్తి కొలంబియ యునివర్సిటిలో చదువుకొని ప్రతికూల వ్యవస్తనుంచి సానుకూల మార్గాన్ని ఎంచుకున్నారు.
అటువంటి వ్యక్తిని ఈ దేశం గౌరవించుకొనే స్ధాయికి ఎదిగాడని అన్నారు. కొలంబియ యునివర్సిటి గ్రంధాలయానికి తాను వెళ్ళి అయన చిత్రపటానికి పూలమాల వేసి తాను మన అందరికి స్పూర్తి అని నెమరవేసుకున్నాడు. ఈ రోజు మన దేశంలో అందరు సమనమైన హక్కులు పొందుతున్నారంటే అయన అలోచన విధానమే ఇందుకు మార్గం అన్నారు. ఎన్నో అసమానతలు, ఇబ్బందులు అధిగమించడానికి ఏకైక మార్గం విధ్య అని నమ్మిన వ్యక్తి అయన అని పేర్కొన్నారు. మీ మేదస్సు ద్వారా డా.బాబా సాహెబ్ అంబేద్కర్ స్థాపించి సమసమాజ స్థాపన కోసం ఉపయోగపడేల ఉండాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగాన్ని చదువుకోవాలి, చట్ట సబలలో కూర్చుంనంత కాలం రాజ్యాంగాన్ని అమలు చేయాలని ఉపోద్గాతాన్ని ఉంచుకోవడం జరిగిందన్నారు. భారత దేశంలో అద్బుతమైన వనరులు ఉన్నాయి. ప్రపంచాన్ని జయించగలిగిన శక్తి ఉంది, ఆ శక్తి అంత జాతి నిర్మాణంలో జాతుల పోరాటంలో నిర్విర్యమవుతుందన్నారు.
అందరం ఒక్క తాటిపై ఉండి ఎటువంటి మనస్పర్ధాలు లేకుండా ఉంటే బారత ధేశం ప్రపంచాన్ని జయించగలిగేదని అయన పేర్కొన్నారు. అనగారిన వర్గాల కోసం ప్రయత్నించినట్టుగా చాలమంది అయనను చిత్రికరించడం జరిగిందన్నారు. ఈ దేశంలో ఉన్న పౌరులందరు సమానంగా ఓటు హక్కును పొందేవిధంగా అలోచన చేసారనన్నారు. ఈరోజు ఓటు హక్కు లేకుండా ఉంటే ఏ పాలకుడు ఇంటికి వచ్చి పలకరించేవాడు కాదని అయన పేర్కొన్నారు. కేవలం ఓటు హక్కు ద్వారానే ఈ ప్రభుత్వాన్ని పాలించే హక్కు ప్రజలకు కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్ధిక శాఖ కార్యదర్శి రామకృష్ణ రావు, మాజి శాసన సభ్యులు కె.లక్ష్మా రెడ్డి, జె.ఎన్.టి.యు.హెచ్ అధ్యాపకులు, విధ్యార్దులు పాల్గోన్నారు.