calender_icon.png 26 April, 2025 | 4:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ జాతీయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

25-04-2025 09:59:13 PM

తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరాల నిర్వహణకు..

కామారెడ్డి (విజయక్రాంతి): వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ తెలుగు రాష్ట్రాల జాతీయ స్థాయి పురస్కారాలు-2025 కు ప్రకటించిన జాతీయ స్థాయి పురస్కారానికి కామారెడ్డి రక్తదాతల సమూహ వ్యవస్థాపకుడు, ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు ఎంపిక కావడం జరిగిందని ఆదివారం నాడు గోదావరిఖనిలో అందుకోవడం జరుగుతుంది. ఈ అవార్డుకు ఎంపిక చేసిన సంస్థ చైర్మన్ లయన్ డాక్టర్ సురభి శ్రీధర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది చిన్నారులు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారని వారి కోసం మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి 2500 ల యూనిట్ల రక్తాన్ని సేకరించి అందజేయడం జరిగిందని ఈ సేవను గురించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకొని దేశంలోనే మొదటి సంస్థగా కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవిఎఫ్ లు సంయుక్తంగా నిలవడం జరిగిందని అన్నారు. ఈ పురస్కారం ఆదుకోవడానికి సహకరించ రక్తదాతలకు మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు.