calender_icon.png 30 April, 2025 | 8:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ పురస్కారాన్ని అందుకున్న డాక్టర్ బాలు

28-04-2025 04:46:51 PM

కామారెడ్డి టౌన్ (విజయక్రాంతి): వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ  జాతీయ స్థాయి పురస్కారాన్ని గోదావరిఖనిలో సోమవారం కామారెడ్డి రక్తదాతల సమూహ వ్యవస్థాపకుడు, ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు అందుకున్నారు. ఈ సందర్భంగా అవార్డ్ గ్రహీత డాక్టర్ బాలు మాట్లాడుతూ.. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో తలసేమియా వ్యాధితో 200 ల మంది బాధపడుతున్నారని వారు చికిత్స నిమిత్తమై హైదరాబాద్, నిజామాబాద్ కు వెళ్లడం జరుగుతుందని, వారి ప్రాణాలను కాపాడాలంటే 15 రోజులకు ఒక యూనిట్ రక్తం అవసరం అని, వారి ప్రాణాలను కాపాడడం కోసం మెగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి 2500 ల యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగిందన్నారు. ఈ పురస్కారాన్ని అందజేసినట్లు సంస్థ నిర్వాహకులు డాక్టర్ సురభి శ్రీధర్ అన్నారు. సహకరిస్తున్న రక్తదాతలకు, మీడియా ప్రతినిధులకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు.