16-02-2025 12:35:19 AM
* పర్యావరణహిత హైదరాబాద్‌కు కృషి
* హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): నార్త్ సిటీ (మేడ్చల్, శామీర్‌పేట్), ఫ్యూచర్‌సిటీలకు మెట్రో విస్తరణ కోసం తాము రూపొందిస్తున్న డీపీఆర్‌లు మార్చి నాటికి సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. శనివారం ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ) తెలం సమ్మిట్ కార్యక్రమంలో ఆ అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్వీఎస్‌రెడ్డి మాట్లాడుతూ కొత్త మె మార్గాలు హైదరాబాద్ రూపురేఖలను మార్చేస్తాయని చెప్పారు. నగరానికి నాలుగు వైపులా మెట్రో సేవలందిచాలనే సీఎం ఆలోచనకు అనుగుణంగా పనులు సాగుతున్నా యని తెలిపారు. హై అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ ఆకాంక్షలను నెరవేర్చే దిశగా మెట్రో ఫేజ్ పనులను చేపడుతున్నామన్నారు.
పర్యావరణ హిత హైదరాబాద్ కోసం కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఐజీబీసీలలో గ్రీన్ క్రూసేడర్స్‌గా నమోదు చేసుకున్న వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఎన్వీఎస్‌రెడ్డి సర్టిఫికేట్లు అందజేశారు. ఐజీబీసీ నేషనల్ వైస్‌చైర్మన్ శేఖర్ రెడ్డి, హైదరాబాద్ చైర్మన్ శ్రీనివాసమూర్తి, క్రెడాయ్ చాప్టర్ చైర్మన్ రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.