సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
- శంషాబాద్ ఏయిర్‌పోర్ట్-ఫ్యూచర్ సిటీ, జేబీఎస్- శామీర్‌పేట, ప్యారడైజ్-
- మేడ్చల్ మెట్రో మార్గాల భూసేకరణకు ఆదేశం
- శామీర్‌పేట, మేడ్చల్ మెట్రో మార్గాల్లో భారీ జంక్షన్
హైదరాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): ఫ్యూచర్ సిటీ, శామీర్‌పేట, మేడ్చల్‌లతో అనుసంధానించే మూడు మెట్రో మార్గాలకు సంబంధించిన సమ గ్ర వివరణాత్మక ప్రణాళికల (డీపీఆర్)ను మార్చి నెలాఖరునాటికి పూర్తిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఈ మూడు మెట్రో డీపీఆర్‌లకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొంది ఏప్రిల్ నెలాఖరు నాటికి టెండర్లు పిలవాలని సీఎం అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణ, రేడియల్ రోడ్ల నిర్మాణాలు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాలపై తన నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం సాయం త్రం సమీక్ష సమావేశం నిర్వహించారు.
భూసేకరణ వెంటనే పూర్తి చేయాలి
ఈ సందర్భంగా సీఎం మాట్లాడు తూ.. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం-ఫ్యూచర్ సిటీ మెట్రో (40 కి.మీ), జూబ్లీ బస్ స్టేష న్ (జేబీఎస్)-శామీర్‌పేట మెట్రో (22 కి.మీ), ప్యారడైజ్-మేడ్చల్ మెట్రో (23 కి.మీ) మార్గాలకు సంబంధించి భూసేకరణను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు స్పష్టంగా సూచించారు.
ఎలివేటెడ్ కారిడార్ల విషయం లో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు. ఎలైన్‌మెంట్ రూపొం దించేటప్పుడే క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీల న చేయాలన్నారు. మేడ్చల్ మార్గంలో ఎన్‌హెచ్ ఇప్పటికే ఉన్న మూడు ఫ్లుఓవర్లను దృష్టిలో ఉంచుకుని మెట్రో లైన్ తీసుకెళ్ళాలని సీఎం సూచించారు. ఎలివేటెడ్ కారి డార్ల నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని సీఎం అధికారులకు ఆదేశించారు.
ఒకే చోట మెట్రోలు ప్రారంభం అయ్యేలా..
శామీర్‌పేట, మేడ్చల్ మెట్రోలు ఒకేచోట ప్రారంభం అయ్యేలా చూసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. అక్కడ అధునాతన వసతు లు, భవిష్యత్తు అవసరాలకు తగినట్టు భారీ జంక్షన్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు.
ఆయా ప్రాంతాలవారు ప్రతి పనికి నగరంలోకి రానవసరం లేకుండా అక్కడే అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఆ జం క్షన్‌ను అభివృద్ధి చేయాలన్నారు. జంక్షన్‌కు సంబంధించిన పూర్తి ప్రణాళికను కూడా తయారుచేయాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) కింద రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు.
ఈ సమీక్ష సమావేశం లో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (మౌలిక వసతులు) శ్రీనివాసరాజు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాల కమిషనర్ శశాంక తదితరులు పాల్గొన్నారు.