15-02-2025 01:08:02 AM
గద్వాల, ఫిబ్రవరి 14 ( విజయక్రాంతి ) : రూ 2 లక్షలు లంచం తీసుకుంటూ గద్వాల జిల్లా పంచాయతీ అధికారి శ్యామ్ సుందర్, పుల్లూరు గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ రెడ్డిలు శుక్రవారం రెండు హ్యాండెడ్ గా పట్టుకు న్నట్లు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. ఏసీబీ డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారంగా... పుల్లూరు గ్రామ శివారులో ఓ వెంచర్ మేనేజర్ తో అను మతి కోసం డబ్బులు డిమాండ్ చేసి డీపీవో శ్యామ్ సుందర్ సూచనమేరకు పుల్లూరు గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ రూ . 2 లక్షల రూపాయలు తీసుకుంటుండగా పట్టుకుని అనంతరం డీపీవో కార్యాలయంలో సోదాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.