calender_icon.png 13 January, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెకనులో 2లక్షల సినిమాలు డౌన్‌లోడ్

29-07-2024 01:56:25 AM

న్యూఢిల్లీ, జూలై 28: సాధారణంగా మనం వాడే ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ఉంటుంది? మొబైల్‌లో అయితే 4జీ, 5జీతో 100 ఎంబీపీఎస్ వరకు వస్తుంది. బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ అయితే ఒక జీబీపీఎస్ వరకు ఉంటుంది. యూకేలోని ఆస్టన్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఏకంగా సెకనకు 400 టీబీలకు పైగా హైస్పీడ్ ఇంటర్నెట్‌ను సాధించగలిగారు. 400 టీబీలు అంటే 4లక్షల జీబీపీఎస్ అన్నమాట. ఈ హైస్పీడ్ ఇంటర్‌నెట్ సహాయంతో ఒక సెకనుకు దాదాపు 2లక్షల సినిమాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నమాట. ఈ టెక్నాలజీకి జపాన్ శాస్త్రవేత్తలు అనుసరించిన విధానమే మూలం అని తెలుస్తోంది. వేర్వేరు వేవ్ లెంత్‌లు ఉన్న కాంతిని ఒకే సమయంలో ఉపయోగించడం ద్వారా 400 టీబీల స్పీడ్‌ను సాధించగలిగారు. గతంలో జపాన్ శాస్త్రవేత్లు 301 టీబీపీఎస్ స్పీడ్‌తో డేటాను ప్రసారం చేయగా.. తాజాగా యూకే శాస్త్రవేత్తలు ఆ రికార్డును అధిగమించారు. ఈ స్పీడ్ తో డేటాను అందించేందుకు ఇప్పుడున్న కేబుళ్లను మార్చాల్సిన అవసరం లేకుండా.. కేవలం డేటాను ప్రసారం చేసే చోట, రిసీవ్ చేసుకునే చోట చిన్నపాటి పరికాలు వాడితే చాలని శాస్త్రవే త్తలు వెల్లడించారు.