calender_icon.png 18 March, 2025 | 4:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్ అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేయాలి

17-03-2025 12:48:49 AM

ఎమ్మెల్సీ కవిత డిమాండ్

హైదరాబా ద్, మార్చి 16 (విజయక్రాం తి): గ్రూప్ పరీక్షలు, ఫలితాలపై అభ్య ర్థులు లేవనెత్తుతున్న అనుమానాలను ప్రభుత్వంతో పాటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నివృత్తి చేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. 11 విశ్వవిద్యాలయాల విద్యార్థుల ప్రతినిధులు ఆది వారం బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి గ్రూప్స్ ఫలితాలపై చర్చించారు.

తాము వ్యక్తపరుస్తున్న అనుమానాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, శాసనమండలిలో లేవనెత్తాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. పేపర్ల మూల్యాంకనంలో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్నారు. అనువాద సమస్య వల్ల ప్రొఫె సర్లు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు మూల్యాంకనం సరిగ్గా చేయలేకపోయారన్నారు. తద్వారా మార్కు ల్లో వ్యత్యాసాలు ఏర్పడ్డాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు.