calender_icon.png 13 February, 2025 | 12:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చికెన్ తినడంలో సందేహం

13-02-2025 12:59:44 AM

మన జిల్లాలో బర్డ్ ఫ్లూ లేదు : జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిమధుసూదన్ గౌడ్ 

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 12 (విజయ క్రాంతి) : చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందని భయంతో కొంతమంది చికెన్ తినేందుకు భయపడుతుండ్రు. మహబూబ్ నగర్ జిల్లా లో రూ. 200 కిలో ఉన్న చికెన్ ధర 175 కి చేరింది. నాగర్ కర్నూల్, గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాలో చికెన్ ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు.

గత రెండు మూడు రోజులుగా బటర్ఫ్ వస్తుందని చికెన్ తినకూడదని ప్రచారం ఉపందుకుంది. చికెన్ సెంటర్లో నిర్వాహకులు సైతం కొంతమేరకు కొనుగోలు తగ్గాయని చెబు తుండ్రు. జిల్లా లో ఎలాంటి ఇబ్బందులు లేవని, జిల్లా సరిహద్దు ప్రాంతాలలో  చెక్ పోస్టుల దగ్గర ఇతర రాష్ట్రాల నుంచి కోళ్లను రాకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, బర్డ్ ఫ్లూ మన జిల్లాలో లేదని పశుసంవర్ధక శాఖ అధికారి మధుసూదన్ గౌడ్ తెలియజేశారు.