హైదరాబాద్: గచ్చిబౌలిలోని గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఏడు రోజుల పా టు జరిగిన ఆల్ ఇండియా జూనియర్ అం డర్-19 బ్యాడ్మింటన్ టోర్నీ శుక్రవారంతో ముగిసింది. డబుల్స్ విభాగంలో వెన్నెల, శ్రేయాన్సీ విజేతలుగా నిలిచారు. డబుల్స్ ఫైనల్లో వెన్నెల-శ్రేయాన్సీ జోడీ 21--15, 21--16తో తారిని-రేషిక పై గెలుపొందారు.
బాలుర డబుల్స్ విభాగంలో భవ్య చబ్రా-ప రం చౌదరి, మిక్స్‌డ్ డబుల్స్‌లో భవ్య-పూణేరా టైటిల్ అందుకున్నారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మేడ్చల్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాసరావు విజేతలకు బహుమతులు అం దించారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ కోశాధికారి వం శీధర్, వికారాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు.