* ప్రశ్నార్థకంగా డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం
* జిన్నారం, కొడకంచిలో మధ్యలోనే నిలిచిన పనులు
* కొత్తపల్లిలో శంకుస్థాపనతో సరి
* త్వరగా పూర్తిచేసి అర్హులకు కేటాయించాలంటున్న స్థానికులు
పటాన్‌చెరు, డిసెంబర్ 30: ఉమ్మడి జిన్నారం మండలంలో గత బీఆర్‌ఎస్ ప్రభు హయాంలో చేపట్టిన డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. పనులు మధ్యలోనే నిలిచిపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... బీఆర్‌ఎస్ హయాంలో మొదటి విడత కింద ఉమ్మడి జిన్నారం మం 150 డబుల్ బెడ్‌రూం ఇండ్లను కేటాయించారు.
అందు జిన్నారం గ్రా 60, కొడకంచి గ్రామానికి 50, గుమ్మడిదల మండలంలోని కొత్తపల్లి గ్రామానికి 40 ఇండ్లు కేటాయించారు. కొడకంచి పంచాయతీ పుట్టగూడ సమీపంలోని సర్వేనంబర్ 11లో అపార్ట్‌మెంట్ తరహాలో 50 డబు బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి 2019 ఫిబ్రవరి 5న ఎమ్మెల్యే గూ మహిపాల్‌రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు.
కొన్నిరోజుల తర్వాత జిన్నా కొత్తపల్లి గ్రామాల్లో కూడా ఇండ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కొడకంచిలో ఐదు సంవత్సరాలుగా పనులు సాగుతూ ఉన్నాయి. నాలుగు బ్లాకుల్లో మూడు అంతస్తులు నిర్మిస్తున్నారు. మరో రెండు బ్లాకులు స్లాబుల స్థాయిలోనే ఉన్నాయి.
పునాది దాటని పనులు..
జిన్నారంలో 60 డబుల్ బెడ్‌రూంల నిర్మాణ పనులు ప్రారంభ దశలోనే ఆగిపోయాయి. గుంతలు తీసి పుట్టింగ్‌లు ఏర్పా చేసి బేస్మెంట్ నిర్మించి వదిలేశారు. నాలుగేళ్లుగా ఎలాంటి పురోగతి లేదు. కొత్తపల్లిలో 40 డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటికీ పనులు ప్రారంభం కాలేదు.
అయితే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ప్రారంభిస్తుందా లేదా అనే ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నం అవుతున్నాయి. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న గూడెం మహిపాల్‌రెడ్డి ప్రస్తుత ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యేగా ఉండటంతో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులపై ఆసక్తి ఏర్పడింది.