calender_icon.png 16 November, 2024 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్కాచెల్లెళ్లకు డబుల్ ఉద్యోగాలు

16-11-2024 03:51:35 AM

కామారెడ్డి, నవంబర్ 15 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన హనుమాల రమ్య, హనుమాల వైష్ణవి అక్కాచెల్లెళ్లు ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో టీచర్ కొలువులు సాధించారు. అంతేకాక.. గురువారం ప్రకటించిన గ్రూప్ ఫలితాల్లో నూ సత్తా చాటారు. అక్కాచెల్లెళ్లు ఇద్దరూ గ్రామంలోని చైతన్య పాఠశాలలో పదో తరగతి వరకు చదివారు. జిల్లా కేంద్రంలోని ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఓ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు.

ఎస్వీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో డీఎడ్ పూర్తి చేశారు. డీఎస్సీ ఫలితాల్లో రమ్య 6వ ర్యాంకు సాధించి తాడ్వాయి మండలం ఎర్రపహడ్  ప్రాథమిక పాఠశాలలో పాఠాలు బోధిస్తున్నది. వైష్ణవికి  జిల్లాలో 5వ ర్యాం కు సాధించి రాజంపేట బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా  పాఠాలు చెప్తున్నది. గ్రూప్  ఫలితాల్లోనూ వీరు విద్యాశాఖ లో ఉద్యోగాలు సాధించారు. వీరిద్దరికీ గ్రామస్తులు అభినందలు తెలిపారు.

అదేవిధంగా పిట్లం మండలం కారెగామ్‌కు చెందిన సురేఖ గ్రూప్ ఫలితాల్లో రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించింది. డీఎస్సీ ఫలితాల్లోనూ ఆమె సోదరి రేణుక టీచర్‌గా ఉద్యోగం సాధించింది. వీరిద్దరినీ సైతం మండల వాసులు అభినందించారు.