రామ్ పోతినేని హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ చిత్రానికి చార్మి కౌర్‌తోపాటు పూరి జగన్నాథ్ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం రాత్రి వైజాగ్‌లో ఏర్పాటుచేసిన ఈవెంట్‌లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు. అన్ని కమర్షియల్ హంగులతో ట్రైలర్‌ను వదిలినట్టు తెలుస్తోంది. లవ్ ట్రాక్ యూత్‌ఫుల్ అయితే, మదర్ సెంటిమెంట్ మరో కీ ఎలిమెంట్ అని చెప్పవచ్చు. శివలింగం వద్ద క్లుమైక్స్ ఎపిసోడ్ అద్భుతంగా ఉంది. రామ్ డబుల్ ఇస్మార్ట్ పాత్రలో ఆకర్షణీయంగా కనిపించాడు.
సంజయ్ దత్ టెర్రిఫిక్‌గా ఉన్నారు. కావ్య థాపర్ సూపర్ హాట్‌గా కనిపిస్తూ రామ్‌తో అద్భుతమైన కెమిస్ట్రీ పంచుకుంది. సినిమాటోగ్రాఫర్లు సామ్ కె నాయుడు, జియాని గియానేలీ తమదైన పనితీరు కనబర్చినట్టు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. మణిశర్మ మ్యూజిక్ స్కోర్ ట్రైలర్‌పై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్, హీరోయిన్ కావ్య థాపర్, నటుడు అలీ తదితరులు మాట్లాడి మూవీ విశేషాలను పంచుకున్నారు.