calender_icon.png 30 October, 2024 | 11:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబుల్ ఇస్మార్ట్ స్టెప్పా మార్!

29-06-2024 12:05:00 AM

హీరో రామ్‌పోతినేని పూరి జగన్నాథ్ కాంబోలో ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రేక్షకులను అలరించటానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాను పూరి తాను రచించి, దర్శకత్వం వహిస్తూ చార్మి కౌర్‌తో కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకు ముస్తాబవుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో సంజ య్ దత్ మెయిన్ విలన్ కాగా, హీరోయిన్ కావ్య థాపర్ ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది.

స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీత సహకారం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. ‘ఫస్ట్ పార్ట్ (ఇస్మార్ట్ శంకర్)కు చార్ట్ బస్టర్ ఆల్బమ్, బీజీఎం అందించిన మణిశర్మ మరోమారు తనదైన బాణీలతో అదరగొట్టేందుకు సిద్ధమయ్యారు’ అని చిత్రబృందం తెలిపింది. ‘స్టెప్పా మార్’ పేరుతో ఫస్ట్ సింగిల్‌ను జూలై 1న విడుదల చేయనున్నామని చెప్పారు.

ఈ విషయాన్ని ప్రకటిస్తూ శివుడి విగ్రహం ముందు రామ్ స్టులిష్ వైబ్‌లో డ్యాన్స్ చేస్తున్నట్టు ఉన్న పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా, అనురాగ్ కులకర్ణి పాడారని, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారని చిత్రబృందం తెలిపింది.