22-04-2025 12:45:43 AM
మోతే, ఏప్రిల్21: గత ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు పక్కా డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం చేపట్టి ఇవ్వాలని లక్ష్యంతో మోతే మండల కేంద్రంలో 64 ఇండ్లను మంజూరు చేసి నిర్మాణాలు చేపట్టి నిరుపేదలైన వ్యక్తుల ను గుర్తించి వారి పేర్లను అర్హుల జాబితాలు చేర్చి గ్రామ సభలో తాసిల్దార్, రెవెన్యూ సిబ్బంది కలిసి చదివి వినిపించారు.
ఇందు లో సుమారు 20 మంది పేర్లను తొలగించి మరో జాబితాతో ఇండ్ల పంపిణి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే అధికారులు ఎంపిక చేసిన 64 మంది లబ్దిదారులలో 20 మంది లబ్దిదారులు అనర్హలని ప్రజలు ఆరోపిస్తున్నారు. వీరిలో ట్రాక్టర్లు, గ్రామంలో రెండు ఇండ్లు ఉన్నవారు ఉన్నారని, రూ. 1లక్షకుS పైబడి వారి వద్ద తీసుకొని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందించారని అర్హులు తెలుపుతున్నారు.
ప్రతి ఇంటికి 30 వేలు వసూలు
మండలంలో కేటాయించిన 64 ఇండ్ల లో సుమారు 20 మంది అనర్హలు ఉంటే వారి నుంచి లక్షల్లో వసూలు చేసిన మద్య వర్తులు అర్హులను సహితం వదిలిపెట్టలేదని సమాచారం. అర్హుల నుంచి రూ. 30 వేల వసూలు చేసినట్లు బాధితులు తెలుపుతున్నారు.
గత రెండు సంవత్సరాల క్రితం ఇండ్ల పంపిణి జరిగి పట్టాలు తీసుకొని ఇండ్ల కేటాయింపు పూర్తి అయినా నేటికి ఇండ్ల తాళాలు తెరుచుకోలేదు. ఇదిలా ఉంటే లబ్దిదారులు మాజీ ప్రజాప్రతినిది, ప్రైరవికారి సహకారంతో ఇండ్లను మరోకరికి రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు విక్రమిస్తున్నారని ఇండ్లు రాని పేదలు ఆరోపిస్తున్నారు. అనర్హులకు ఇండ్లు ఇస్తే అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
డబుల్ బెడ్ రూం రికార్డులు లేవా...?
గత 15 రోజుల నుంచి డబుల్ బెడ్ రూం అక్రమాలపై ఆందోళనలు జరుగుతుండా, అర్హులైన బాధితులు స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిని కలిపి పిర్యాదు చేశారు. కాగా అక్రమాలపై విచారన జరపాలని ఎమ్మెల్యే ఆదేశించినట్లు సమాచారం. కాని నేటికీ 15 రోజులు పైబడి అవుతున్న రెవెన్యూ అధికారులు మాత్రం ఏవిధమైన విచారణ చేపట్ట లేదు. కాగా తహశీల్దార్ కార్యాలయంలో డబుల్ బెడ్ రూం లబ్దిదారులకు సంబంధించి రికార్డులు లేనట్టు ప్రచారం జరుగుతోంది.
ఓ రెవెన్యూ అధికారు రికార్డులను మాయం చేశారనే ఆరోపణలు ఉండగా.. ఈ విషయమై ఇన్చార్జి తాసిల్దార్ శ్రీకాంత్ ను వివరణ కోరగా డబుల్ బెండ్ రూం రికార్డులు మా కార్యాలయంలో ఏ విధమైన లేవు. మీ వద్ద ఉంటే ఇవ్వండి మేము విచారణ చేయబడతాం. తప్ప మేము ఏమాత్రం విచారణ చేయలేము అని సమాధానం ఇచ్చారు.