calender_icon.png 22 November, 2024 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరోసారి డబుల్ ఇండ్ల విచారణ

23-10-2024 12:41:16 AM

  1. 15 మంది ప్రత్యేక అధికారుల నియామకం 
  2. క్రిష్టియన్‌పల్లి, వీరన్నపేట, దివిటిపల్లిలో నేటి నుంచి సర్వే
  3. వెల్లడించిన కలెక్టర్ విజయేందిర బోయి 

మహబూబ్‌నగర్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): పాలమూరులో డబుల్ బెడ్‌రూం ఇండ్ల విచారణ మరోమారు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. కేటాయింపు ల్లో అవకతవకలు జరిగాయని తరచూ ఫిర్యాదులు వస్తుండటంతో ఇప్పటికే 12 మార్లు విచారణ చేశారు.

తాజాగా మరోసారి విచారణకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఇందుకోసం కలెక్టర్ విజయేందిర బోయి 15 మంది ప్రత్యేక అధికారులను నియమించా రు. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని క్రిష్టియన్‌పల్లిలో 310, వీరన్నపేటలో 660, దివిటిపల్లిలో 1024 ఇండ్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. లబ్ధిదారులకు సంబం ధించి క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు.

ఒకరికీ కేటాయించిన ఇంటిలో మరొకరు..  

సొమ్మొకరిది.. సోకొకరది అన్న చందాన ప్రభుత్వం ఇల్లు ఒకరికి కేటాయిస్తే మరొకరు నివాసం ఉంటున్నట్టు తెలిసింది.ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపి కపై సమగ్ర విచారణ చేయనున్నట్టు తెలిసింది. డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించిన మూడు ఆ ప్రాంతాల్లోనూ పూర్తిస్థాయిలో విచారణ చేసి అర్హులను తేల్చుతామని అధికారులు చెప్తున్నారు. కొందరు లబ్ధిదారులు ఇండ్లు విక్రయించారని సైతం ఫిర్యాదులు వచ్చినట్టు సమాచారం.  

లబ్ధిదారుల్లో ఆందోళన 

తమకు ఇండ్లు కేటాయించిన తర్వాత రూ.౪ లక్షల నుంచి రూ.౮ లక్షల వరకు వెచ్చించి సౌకర్యాలు కల్పించుకున్నామని లబ్ధిదారులు చెప్తున్నారు. అధికారులు తర చూ విచారణల పేరుతో ఇబ్బందులకు గురిచేయడం సరికాదని అసహనం వ్యక్తంచే స్తున్నారు. ఇండ్లు కేటాయించినప్పుడే విచారణ చేసి ఇచ్చారని.. ఇప్పటివరకు ౧౨ సార్లు విచారణలు చేశారని అన్నారు. మళ్లీ ఇప్పు డు విచారణ అంటూ అధికారులు సిద్ధమవుతుండటంతో ఏంజరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.