‘మత్తు వదలరా’కు సీక్వెల్‌గా ‘మత్తువదలారా2’ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. శ్రీసింహ కోడూరి లీడ్ రోల్‌లో తన సైడ్ కిక్‌గా సత్య నటిస్తున్న ఈ చిత్రానికి రితేశ్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ శుక్రవారం హైదరాబాద్‌లో టీజర్‌ను విడుదల చేశారు.
టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో శ్రీసింహ మాట్లాడుతూ.. “ఫస్ట్ పార్ట్‌ను థియేటర్‌లో చూడలేకపోయామని చాలా మంది నాకు మెస్సేజ్‌లు చేశారు. వాళ్లందరికీ ఫన్ డబుల్, థ్రిల్ ఎక్స్‌పీరియన్స్ ఉండేలా సెకండ్ పార్ట్ చేశాం” అన్నారు. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు నేను వర్క్ చేసిన బెస్ట్ టీమ్ ఇది. ఈ సినిమాలో నేను ఓ పాట రాసి, పాడాను.. కొరియోగ్రఫీ కూడా చేశాను. త్వరలోనే ఈ పాట వస్తుంది’ అని తెలిపింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రితేష్ రానా, నిర్మాతలు వై.రవిశంకర్, చెర్రీ, మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ పాల్గొన్నారు.