న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు ఆర్చరీ రికర్వ్ విభాగంలో భారత పురుషుల, మహిళల బృందాలు ర్యాంకింగ్స్ ఆధారంగా అర్హత సాధించాయి. సోమవారం వరల్డ్ ఆర్చరీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో పురుషుల, మహిళల విభాగాల్లో టాప్ ర్యాంకులో నిలిచి ఒలింపిక్స్ టికెట్ అందుకున్నాయి. ఇటీవలే టర్కీ వేదికగా జరిగిన చివరి ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌లో ఇరు విభాగాల్లోనూ భారత బృందం విఫలమైన సంగతి తెలిసిందే.
పురుషుల విభాగం నుంచి తెలుగు ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్‌లతో కూడిన బృందం.. మహిళల విభాగం నుంచి దీపికా కుమారి, భజన్ కౌర్, అంకితతో కూడిన జట్టు విశ్వక్రీడల్లో పాల్గొననుంది. పారిస్ క్రీడల్లో ఆర్చరీ విభాగంలో మొత్తం ఐదు మెడల్ ఈవెంట్స్‌లో భారత ఆర్చర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. పురుషుల, మహిళల రిక్వర్ వ్యక్తిగత, కాంపౌండ్, మిక్స్‌డ్ విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. తరుణ్ దీప్ రాయ్, దీపికా కుమారీకి ఇవి నాలుగో ఒలింపిక్స్ కాగా.. ధీరజ్, అంకిత, భజన్ కౌర్ తొలిసారి విశ్వక్రీడల బరిలో దిగనున్నారు.
ఒలింపిక్స్‌కు భారత ఆర్చరీ జట్లు: పురుషుల బృందం: బొమ్మదేవర ధీరజ్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్.
మహిళల బృందం: దీపికా కుమారి, భజన్ కౌర్, అంకిత.