calender_icon.png 24 December, 2024 | 9:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబుల్ బెడ్ రూం పనులు పూర్తి కావాలి

19-10-2024 02:43:57 AM

సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట,అక్టోబర్18(విజయక్రాంతి): సూర్యాపేట మండల పరిధిలోని కేసారం గ్రామంలో గల 2వ విడుత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పనులు మరో 45 రోజుల్లో పూర్తి కావాలని అధికారులను జిల్లా  కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్  ఆదేశించారు. శుక్రవారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పనులను పరిశీలించారు.

అనంతరం కలెక్టర్  మాట్లాడుతూ యుద్ధ ప్రాతిపదికన పనులు 45 రోజుల్లో  పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేయాల ని  సూచించారు. అనంతరం తాళ్లఖమ్మం పహాడ్ గ్రామంలోని ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయు లు సమయపాలన పాటించాలన్నారు.

వి ద్యార్థులకు అర్థం అయ్యే విధంగా బోధన చేయాలన్నారు. హాజరు రికార్డులు, నీళ్ల ప్లాంట్‌ని పరిశీలించారు. విద్యార్థులు బాగా చదివి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ శ్యామ్ సుందర్‌రెడ్డి, ఆర్‌అండ్ బీ అధికారి పవన్ కుమార్ ఉన్నారు.