calender_icon.png 8 January, 2025 | 5:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన నిరుపేదలకే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలి

06-01-2025 07:40:25 PM

ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షులు మొయ్య రాంబాబు...

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలో నిర్మాణం పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన నిరుపేదలకు మంజూరు చేయాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పట్టణ ఆటో డ్రైవర్ యూనియన్ అధ్యక్షులు మొయ్య రాంబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పట్టణంలోని మున్సిపల్ మున్సిపల్ కమిషనర్, తహసిల్దార్ లకు వేర్వేరుగా వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు కేటాయిస్తూ ఇటీవల అధికారులు విడుదల చేసిన జాబితాలో అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. అర్హులైన లబ్ధిదారులకు కాకుండా అనర్హులకు జాబితాలో చోటు దక్కిందని ఆందోళన వ్యక్తం చేశారు. జాబితాపై వార్డుల వారీగా విచారణ చేపట్టి అర్హులను గుర్తించి వారికే కేటాయించాలని డిమాండ్ చేశారు.

లబ్ధిదారుల ఆధార్ కార్డులను ఆధారంగా చేసుకుని సమగ్ర విచారణ జరపాలని తద్వార వారికున్న ఆస్థులు, భూములు తదితర వివరాలు తెలిసే వీలున్నందున ఆధార్ కార్డును ఆధారంగా చేసుకొని సమగ్ర విచారణ జరిపి లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. గత ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్ధిదారులలో అర్హులైన వారికి న్యాయం చేసి తాజాగా విడుదల చేసిన అర్హుల జాబితాపై పునర్విచారణ జరిపించాలని కోరారు. ఈ విచారణ పూర్తిగా అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించాలని ఇందులో కాంగ్రెస్ వార్డు కమిటీలకు అవకాశం ఇవ్వకుండా అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి అర్హులకు న్యాయం చేయాలని కోరారు. అలాగే ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో బాగంగా పట్టణంలోని నిరుపేద ఆటో డ్రైవర్ లను గుర్తించి వార్డుకు 10 మంది ఆటో డ్రైవర్లకు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు కనకం రవీందర్, కొప్పుల రమేష్, మామిడి క్రాంతి కుమార్, శంకర్, పాత వీరస్వామి, మిట్టపల్లి బాపులు పాల్గొన్నారు.