calender_icon.png 23 February, 2025 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తి చేసి అర్హులకు ఇవ్వాలి

22-02-2025 06:26:36 PM

హుజూర్ నగర్,(విజయక్రాంతి): డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల(Double Bedroom Houses)ను పూర్తి చేసి అర్హులైన పేదలకు ఇవ్వాలని సిపిఎం పార్టీ(CPM Party) డిమాండ్ చేసింది. హుజూర్ నగర్ మండల పరిధిలోని సీతారాంపురం గ్రామంలో శనివారం సిపిఎం బృందం డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించారు. మండల కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్ మాట్లాడుతూ... గత ప్రభుత్వంలో నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇల్లు అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని వెంటనే మరమ్మత్తులు చేసి అర్హులైన పేదలందరికీ ఇవ్వాలన్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా నిర్మాణంలో ముగ్గురు కాంట్రాక్టర్లు మారిన  డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తికాక కంపచట్లతో శిధిలమయ్యే పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదల బతుకులు మారతాయని, ప్రజా సమస్యల పరిష్కారం అవుతాయని ప్రజలు ఆలోచిస్తు న్నారు.సీతారాంపురం గ్రామంలో ఒక్క ఇంట్లో ముగ్గురు నలుగురు జీవనం సాగిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే అసంపూర్తిగా ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టి అర్హులైన ప్రజలకు ఇవ్వాలన్నారు.ఐద్వా జిల్లా అధ్యక్షురాలు తంగెళ్ల వెంకట చంద్ర,మాడూరి నరసింహ చారి,వీరస్వామి,గోపరాజు, సైదమ్మ,భాస్కర్ లు పాల్గొన్నారు.