calender_icon.png 13 March, 2025 | 5:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం ప్రారంభం

12-03-2025 11:45:29 PM

జుక్కల్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని బంగారుపల్లి గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పలువురు లబ్దిదారులు ప్రారంభించినట్టు జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. బుధవారం నాడు బంగారు పల్లి గ్రామాన్ని సందర్శించిన ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామానికి నూటఐదు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరైనవని ఆయన పేర్కొన్నారు. అందులో కొంతమంది ఇండ్ల నిర్మాణం కొరకు పనులను ప్రారంభించారని, ఇంకొంతమంది పనులు ప్రారంభించలేదని, అందులో భాగంగా నేడు గ్రామాన్ని సందర్శించి, జరుగుతున్న నిర్మాణం పనులను పరిశీలించినట్టు ఆయన తెలిపారు.లబ్దిదారులకు ఇండ్ల నిర్మాణంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి పటిష్టంగా నిర్మించుకోవాలని సూచనలు చేయడం జరిగిందని ఆయన అన్నారు. అదేవిధంగా గ్రామంలో మంజూరైన ప్రతి ఒక్క లబ్ధిదారులు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించాలని పనులు పూర్తి చేసన లబ్దిదారులకు ప్రభుత్వం మంజూరైన నిధులను ప్రభుత్వం విడుదల చేసినప్పుడు లబ్దిదారులకు అందించడం జరుగుతుందని ఎంపీడీవో పేర్కొన్నారు.