calender_icon.png 21 April, 2025 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపయోగంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు

21-04-2025 01:55:13 AM

కామారెడ్డి, ఏప్రిల్ 20 (విజయక్రాంతి), కామారెడ్డి జిల్లాలో పలు మండల కేంద్రాల్లో గత ప్రభుత్వా హాయంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లబ్ధిదారులకు పంపిణీ చేయకపోవడంతో నిరూప యోగం గా మారాయి. ఇల్లు లేని నిరుపేదలకు నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు  కేటాయించకపోవడంతో లబ్ధిదారులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో గత ప్రభుత్వ ఆయాంలో 50 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించారు. నిరుపేదలకు కేటాయించాల్సి ఉండగా లబ్ధిదారులు ఎక్కువగా ఉండటంతో ఎవరికి కేటాయించలేదు. దీంతో నిర్మించి ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిరుపయోగంగా ఉన్నాయి. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన లబ్ధిదారులను గుర్తించి కేటాయించాలని కోరుతున్నారు.