calender_icon.png 18 April, 2025 | 4:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గురించి లబ్ధిదారుల ఆందోళన

09-04-2025 03:59:24 PM

తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన లబ్ధిదారులు

చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వం 108 ఇండ్లు నిర్మించినదని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో పేర్లు వచ్చినప్పటికి వారికి ఇంకా అధికారికంగా ఇండ్లు ఇవ్వడం లేదన్నారు. అలాగే వారికి కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇంట్లో  వారు అనధికారికంగా ఉంటే రెవెన్యూ సిబ్బంది మీకు పర్మిషన్ లేదంటూ వారిని బయటికి పంపించారు. దీనితో చేసేదేమి లేక లబ్ధిదారులు అందరు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి ఆందోళన చేపట్టారు. బాధితులు మాట్లాడుతూ... మాకు కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను తక్షణమే మాకు ఇవ్వాలని లేని యెడల మాకు చావే శరణ్యమన్నారు.

ఇప్పుడు ఇలా ఇంటికి తాళం వేసి మమ్మల్ని బయటికి పంపిస్తే మేము ఎక్కడ తల దాచుకునేది మాకు ఎలాంటి స్వంత ఇండ్లు లేవు అని, మాకు జాబితాలో వచ్చిన పేర్ల ప్రకారం తక్షణమే మాకు ఇండ్లు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఈ విషయం లో తహసీల్దార్ శ్రీకాంత్ ని వివరణ కోరగా లబ్ధిదారుల గురించి గతంలో లిస్టు ఫైనల్ చేయగా  కానీ దానిలో కొన్ని సమస్యలు ఉన్నాయని, దానిని ఇప్పటివరకు గుత్తాదారు ప్రభుత్వానికి కి అప్ప చెప్పలేదుఅని. గుత్తాదారు ప్రభుత్వనికి కి అప్పజెప్పిన తర్వాత ప్రభుత్వ  నిర్ణయం ప్రకారం లబ్ధిదారులను మళ్ళీ ఎంపిక చేసి దాని ప్రకారం లబ్ధిదారులు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అప్పటివరకు ఎవరు కూడా  అక్రమంగా అక్కడికి పోయి ఉండరాదు అని అన్నారు.