calender_icon.png 10 January, 2025 | 8:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబుల్ బెడ్‌రూం పేరిట 15 లక్షల వసూళ్లు

10-01-2025 12:06:24 AM

శేరిలింగంపల్లి, జనవరి 9: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ఇప్పిస్తామంటూ పలువురు నిరుపేదలకు భారీ మొత్తంలో మోసం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన ప్రకారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని టీఎన్జీఓస్ కాలనీకి చెందిన నాగరాజు శేరిలింగంపల్లి ఎమ్మార్వో ఆఫీస్‌లో పనిచేస్తున్నానంటూ నమ్మించాడు.

డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు వచ్చేలా చూస్తానని ఒక్కొక్కరి నుంచి రూ.50 వేల చొప్పున వసూళ్లు చేసినట్లు తెలిసింది. ఇలా సుమారు 22 మంది నుంచి దాదాపు రూ.10 నుంచి రూ.15 లక్షల వరకు వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. బాధితులు పలుమార్లు నాగరాజుకు ఫోన్‌చేయగా.. కలెక్టర్ ఆఫీస్‌లో మీ పనిమీదే ఉన్నానంటూ చెప్పాడు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.