06-04-2025 12:00:00 AM
హాయ్ ఫ్రెండ్స్.. నన్ను చూడగానే డోరా అని గుర్తు పట్టేశారుగా? ఇప్పుడు నేనిలా మీ పేజీలోకి రావడానికి ఓ కారణం ఉంది తెలుసా? రోజూ నన్ను టీవీల్లో చూసే మీకో సంతోషకరమైన విషయం చెబుదామనే ఇలా వచ్చా.. ఇప్పుడు ‘డోరా ది ఎక్స్‌ప్లోరర్’ అనే సీరియల్‌ను టీవీల్లో చూసే పిల్లల సంఖ్య బాగా పెరిగింది. నన్ను ఏకంగా కోట్లమంది చిన్నారులు నన్ను చూస్తూ కేరింతలు కొడుతున్నారన్నమాట. ఇంతమంది నన్ను అభిమానిస్తున్నారంటే మామూలు విషయం కాదు కదా..! అంతేకాదు ఇప్పుడు దేశంలోనే కార్టూన్ పాత్రల్లో నేనే నెంబర్ వన్ అన్నమాట. నా వల్ల జరిగే వ్యాపారం కూడా బాగా పెరిగిందంటే నమ్మగలరా?
ఈ సిరీస్ ఏడేళ్ల అమ్మాయి డోరా మార్వ్వెజ్ చుట్టూ తిరిగింది. ఆమె తాను పాల్గొనాలనుకునే కార్యకలాపానికి ఆమె వెళ్లాలనుకునే ప్రదేశానికి సంబంధించిన అన్వేషణను ఈ సీరియల్లో చూడవచ్చు. భుజానికి ఊదా రంగు బ్యాక్‌ప్యాక్, బూట్స్ అనే ఆంత్రోపోమోర్ఫిక్ కోతి తో కలిసి చక్కర్లు కొడుతుంటుంది. డోరా జర్నీ చేసే సమయంలో ఎదురయ్యే సమస్యలను చిక్కులను, అడ్డంకులను ప్రేక్షకుల సహయంతో పరిష్కరిస్తుంది. పజిల్స్ చుట్టూ స్టోరీ నడుస్తుంది. సాధారణ ఆచారాలలో డోరా ద్విపాద, ఆంత్రోపోమోర్ఫిక్ ముసుగు దొంగ నక్క అయిన స్వైపర్‌తో ఆమె ఎదుర్కొనే సంఘటనలు ఉండవచ్చు.
స్వైపర్‌ను ఆపడానికి, డోరా, బూట్స్ ‘స్వైపర్, స్వైపింగ్ లేదు’ అని మూడుసార్లు చెప్పాలి. అయితే స్వైపర్ ఇతర వ్యక్తుల వస్తువులను దొంగిలించే సందర్భాల్లో, బూట్స్ డోరా దొంగిలించబడిన వస్తువులను గుర్తించడంలో సహాయం చేసే సవాళ్లు ప్రత్యేకంగా ఉంటాయి. డోరా, బూట్స్ వంతెన కింద నివసించే ‘గ్రంపీ ఓల్డ్ ట్రోల్’ వారిని దాటడానికి అనుమతించే ముందు వీక్షకుడి సహాయంతో పరిష్కరించాల్సిన చిక్కుముడిని సవాలు చేస్తాడు. ప్రతి ఎపిసోడ్‌లో డోరా ఆటలతో, పజిల్స్‌తో.. తాను చేరుకోవాలనుకున్న ప్రదేశానికి చేరుకుని ‘మేం దీన్ని చూశాం’ అని పాటను బూట్స్ విజయంతో పాడటంతో ఎపిసోడ్ ముగుస్తుంది.
ఈ డోరా కథ మన చుట్టూ ఉన్న పిల్లల చిలిపి కథను తలపిస్తుంది. పైగా సామాజిక జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. చక్కగా నడిచే కథతో తయారైన తొలి కార్టూన్ అమ్మాయి పాత్రను కూడా నేనే కావడం విశేషం.
నేనంటే మీకే కాదు విదేశాల్లోని పిల్లలకూ ఎంతో ఇష్టం. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా టీవీల్లోకి దూకేసింది.
టీవీల్లోనే కాదు సెల్‌ఫోన్లలో కూడా నా సందడి అంతా ఇంతా కాదు. నా బొమ్మతో చేసిన ఒక ఆండ్రాయిడ్ ఆట విడుదల చేశారు. దాన్ని చాలామంది డౌన్‌లోడ్ చేసుకుని ఆధరించారు.
ఇక నా బొమ్మలకైతే బోలె డు గిరాకీ. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా డోరా ప్రత్యేక దుకాణా లు ఉన్నాయి. అందులో తొడుక్కునే టీషర్టులు, గడియారాలు, దిండ్లు, ఆటవస్తువులు ఇలా ఒక్కటనేమిటి కొన్ని వందల రకాల బొమ్మలు దొరకుతాయి. త్వరలో మరిన్ని స్టోర్స్ కూడా వస్తా యి. ఇక ఎన్నో కంపెనీలు నా బొమ్మలతో వస్తువులు తయారు చేయడం నాకెంతో గర్వంగా ఉంది.
ఫ్రెండ్స్.. మొత్తానికి మీతో నా కబుర్లు చెప్పినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. నా కోడ్ తెలుసుగా.. ‘స్వైపర్, స్వైపింగ్ లేదు’ అంటే చాలు నేను ఆ ప్రదేశంలోకి వెళ్లిపోతాను.. మరి ఉంటాను.. బైబై!