calender_icon.png 28 October, 2024 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచ వినాశనం తప్పదా?

28-10-2024 01:05:58 AM

  1. 2025పై బాబా వంగా, నోస్ట్రడామస్ ఏం చెప్పారు?
  2. మళ్లీ ప్లేగు మహమ్మారి విజృభిస్తుందా?
  3. ఐరోపాలో ఏం జరగనుంది?

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: కొంతమంది జోతిష్యుల అంచనాలు ఎక్కువమంది నమ్ముతుంటా రు. తెలుగు రాష్ట్రాల్లో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానానికి ఎంతో ఆదరణ ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే నోస్ట్రడామస్, బాబా వంగా, మయన్ క్యాలెండర్ వంటివి ఎక్కువగా పాపులర్ అయ్యాయి.

నోస్ట్రడామస్, బాబా వంగా ప్రపంచానికి ఎదురయ్యే వినాశనాలు, సమస్యల గురించి ముందే హెచ్చరించారు. 2025 సమీపిస్తుండటంతో వారు భవిష్యత్తు గురించి చెప్పిన అంచనాలు మరోసారి తెరమీద కు వచ్చాయి. మరో రెండునెలల్లో రాబోయే 2025లో తీవ్ర సంఘర్షణలు, గందరగోళ పరిస్థితులు తలెత్తుతాయని, ఇవి ఒకరకంగా ప్రపంచ వినాశనానికి దారితీస్తాయని చెప్పారు. 

2025 గురించి ఏం చెప్పారు?

వచ్చే ఏడాది గురించి ఇద్దరూ ఒకే రకమైన భవిష్యత్తును అంచనా వేశారు. పురాతన ప్లేగు మహమ్మారి కన్నా పరిస్థితులు ఘోరంగా మారుతాయని నోస్ట్రడామస్ హెచ్చరించారు. ఐరోపా కు పెను సవాళ్లు ఎదురవుతాయని చెప్పారు. వచ్చే ఏడాది ప్రపంచవ్యాప్తంగా వినాశకరమైన పరిణామాలు సంభవిస్తాయని, ప్రపంచ విపత్తు వచ్చే అవకాశాలు ఉన్నాయని బాబా వంగా పేర్కొన్నారు. అందుకే మళ్లీ వీళ్ల పేర్లు వెలుగులోకి వచ్చాయి. 

నిజమైన అంచనాలు ఏవి?

ఫ్రెంచ్ విప్లవం, నాజీ నియంత ఆడాల్ఫ్ హిట్ల ర్ ఎదుగుదల, అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ హత్య, 9/11 దాడులు, కొవిడ్ వంటి కీలకమైన అంశాలు నోస్ట్రడామస్ వెల్లడించారు. చెర్నోబిల్ విపత్తు, 9/11 దాడులు, కొవి డ్‌హూ మహమ్మారి, బ్రిటన్ యువరాణి డయా నా మరణాన్ని బాబా వంగా అంచనా వేశారు. 

బాబా వంగా ఇంకేం చెప్పారు?

మానవులు 2028 నాటికి శుక్రగ్రహాని చేరుకునే మిషన్‌ను ప్రారంభిస్తారని చెప్పారు. 2033 నాటికి వాతావరణ మార్పులతో ధ్రువాల్లో  మంచు కరిగి సముద్రమట్టాలు పెరుగుతాయని,  2076 నాటికి మళ్లీ కమ్యూనిజం తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పారు. 22వ శతాబ్దంలో  ఏలియన్స్‌తో సంబంధాలు ఏర్పడుతాయని, ప్రపంచవ్యాప్తంగా కరువు తాండవిస్తుందని అంచనా వేశారు. 3005లో భూమి, అంగారక గ్రహం మధ్య యుద్ధం జరుగుతుందని చెప్పారు.    

ఎవరు వీళ్లు?

నోస్ట్రడామస్ అసలు పేరు మిచెల్ డి నోస్ట్రెడామ్. 16వ శతాబ్దపు ఫ్రెంచ్ వైద్యుడు, జోతిష్యుడు. 1555లో 900కుపైగా శ్లోకాల తో లెస్ ప్రొఫెటీస్ అనే పుస్తకాన్ని రాశాడు. ఇందులో భవిష్యత్తు సంఘటలను అంచనా వేశాడు. నోస్ట్రడామస్ ఎన్నో చారిత్రక సంఘటనలను ముందే ఊహించినట్లు నమ్ముతా రు. బాబా వంగా పుట్టుక నుంచే అందురా లు. బల్గేరియన్ వైద్యురాలు, ఆధ్యాత్మికవేత్త. ఈమెను బాల్కన్ నోస్ట్రడామస్ అని కూడా పిలుస్తారు. బాబా వంగా 1996లో చనిపోయారు. ఆమె చెర్నోబిల్ విపత్తు, 9/11 దాడు ల గురించి ముందే అంచనా వేశారు.