calender_icon.png 27 October, 2024 | 3:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలియదా.. తెలిసీ చెప్పలేదా?

10-08-2024 01:11:01 AM

  1. ‘సుంకిశాల’ ప్రమాదంపై గోప్యత ఎందుకు?
  2. ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
  3. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి అస మర్థతతోనే సుంకిశాల పథకం రిటెయినింగ్ వాల్ కూలిందని, ఘటనపై సీఎం ఎందుకు గోప్యత పాటిస్తున్నారో ప్రజలకు తెలపాలని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈనెల 2న ఘటన సంభవించిందని, అప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా ప్రభు త్వం ఎందుకు అసెంబ్లీలో ఆ విషయం ప్రస్తావించలేదని నిప్పులు చెరిగారు.హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

గోడ కూలడంతో హైదరాబాద్‌కు తాగునీటి జలాలు తరలించేందుకు నిర్మిస్తున్న పథకానికి నష్టం జరిగిందన్నారు. రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రిగా బాధ్యత వహిస్తున్న సీఎం వారం రోజుల పాటు ఘ టనను దాచిపెట్టేందుకు యత్నించడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. సుంకిశాల ప నులు చేపట్టిన సంస్థను వెంటనే బ్లాక్ లిస్టు లో పెట్టాలని డిమాండ్ చేశారు. సదరు కం పెనీకి ఎక్కడా పనులు అప్పగించవద్దన్నారు. గోడ కూలిన ఘటనపై బీజేపీ నేతలు ఎం దుకు మౌనం వహిస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు.

కాళే శ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని మేడిగడ్డ బరాజ్ విషయంలో హడా వుడి చేసిన వారు ఇప్పుడు ఎక్కడున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మ క్కైన సంగతి ప్రజలకు అర్థమవుతోందని ఆరోపించారు. సుంకిశాల ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ కమిషన్ చేయించి నిజాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీ ఎం భట్టి విక్రమార్క పనిగట్టుకుని సుంకిశాల ప్రమా దానికి కారణం గత ప్రభుత్వమని చె ప్తున్నారని, అది కేవలం కుట్ర మాత్రమేనని స్పష్టం చేశారు. 

అధికారులు చెప్పిన వినకుండా సుంకిశాల గేట్లు అమర్చారని, గోడ కూలిన సమయంలో కూలీలు షిఫ్ట్ మారడంతో పెనుప్రమాదం తప్పిందన్నారు. ఎన్ని కల ప్రయోజనం కోసమే నాడు కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై హడావుడి చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నీటి వన రులు, ప్రాజెక్టులపై అవగాహన లేదన్నారు. సమస్యలు వచ్చినప్పుడు ఏదో మొ క్కుబడిగా స్పందించడం తప్ప పాలనపై సీఎం రేవంత్‌రెడ్డికి పట్టులేదన్నారు. సమావేశంలో మాజీ మం త్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు సబితా, వివేకానంద్, ముఠాగోపాల్ పాల్గొన్నారు.

కేజ్రీవాల్, కవితకు త్వరలో బెయిల్

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో త్వరలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వస్తుందని భావిస్తున్నామని కెటీఆర్ అన్నారు. కవితకు బెయిల్ కోరుతూ ఇప్పటికే తాము పిటిషన్ దాఖలు చేశామన్నారు. ఈ కేసులో ఢిల్లీ మాజీ సీఎం మనీశ్  సిసోడియాకు ఇప్పటికే బెయిల్ వచ్చిందన్నారు. జైలులో కవిత 11 కిలోల బరువు తగ్గారన్నారు. ఆమె బీపీ సమస్యలతోనూ ఇబ్బంది పడుతున్నా రన్నారు. ఢిల్లీ మద్యం కేసులో చార్జిషీట్ దాఖలైన తర్వాత కవితను ఇప్పటికీ జైల్లో ఉంచాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.