07-02-2025 01:24:43 AM
ఎంపీ డీకే అరుణ
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు.
మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని షాద్‌నగర్‌లో పాఠశాలపై నుంచి దూకి నీరజ్ అనే విద్యార్థి, బాలానగర్ గురుకులంలో ఉరేసుకుని టెన్త్ విద్యార్థి ఆరాధ్య చనిపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు.
విద్యార్థుల ఆత్మహత్యలకు గల కారణాలు నిగ్గుతేలేలా సమగ్ర విచారణ చేయాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సరైన నిఘా, పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ అసమర్థ పాలనలో హాస్టళ్లలో మృత్యుఘోష వినిపిస్తోందన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.