calender_icon.png 27 September, 2024 | 9:01 PM

ఆందోళన వద్దు.. హాయిగా ఉందాం!

23-09-2024 12:00:00 AM

అల్జీమర్స్ అనేది ఒక రకమైన వ్యాధి. ఇది వృద్ధాప్యంలో ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. రోజువారీ పనులు, స్నానం, ఇతర ముఖ్య విషయాలు గుర్తించుకోవడం కష్టతరం చేస్తుంటుంది. మెదడులోని కణా లు చనిపోవడం కారణంగా అల్జీమర్స్ వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి వేగంగా పెరుగుతోంది. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే దీనికి చికిత్స లేదు. వయసు పెరిగేకొద్దీ ఈ వ్యాధి వచ్చే ప్రమాదం మరింత పెరుగుతుంది. అలాంటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలు అల్జీమర్స్‌కు చెక్ పెట్టొచ్చు.

అల్జీమర్స్ ప్రభావం

  1. అల్జీమర్స్‌తో సామర్థ్యం తగ్గుతుంది. జ్ఞాపకశక్తి బలహీనంగా మారుతుంది. 
  2. 65 సంవత్సరాల తర్వాత రెట్టింపు అవుతుంది.
  3. కుటుంబంలో ఎవరికైనా అల్జీమర్స్ ఉంటే, రాబోయే తరాలపై ప్రభావం పడుతుంది

అల్జీమర్స్ దశలు

1. మొదటి దశలో లక్షణాలు కనిపించవు.

2. చిన్న విషయాలను మరచిపోవడం ప్రారంభించడం.

3. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి బలహీనత.

4. రోజువారీ పనిలో సమస్యలను ఎదుర్కోవడం.

5. వ్యాధి లక్షణాలు పెరగడం, ఇతరులపై ఆధారపడటం.

6. ఆహారం తినడం, బట్టలు ధరించడంలో ఇతరుల సహాయం అవసరం

7. మాట్లాడటంలో ఇబ్బంది, బాడీ లాంగ్వేజ్ కూడా చెప్పలేకపోవడం.

8. ఆలోచించడంలో లేదా నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది

9. తినడం, బట్టలు ధరించడం, టాయిలెట్‌కు వెళ్లడం  కూడా మర్చిపోతున్నారు

10. వ్యక్తిత్వం, ప్రవర్తనలో  మార్పులు

ఏం చేయాలి

  1. విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే కూరగాయలను తినండి
  2. పోషకాలతో కూడిన తాజా సీజనల్ పండ్లను తినండి
  3. యాంటీ ఆక్సిడెంట్లను ఆహారంలో చేర్చుకోండి.
  4. మద్యం, సిగరెట్లకు దూరంగా ఉండండి.
  5. ధ్యానం చేయండి, పజిల్స్ పరిష్కరించండి. 
  6. ఒంటరిగా ఉండకండి, బంధువులతో కలిసి ఉండండి.
  7. మార్నింగ్ వాక్, వ్యాయామం, యోగా-ధ్యానం లాంటివి చేయండి