07-03-2025 01:34:05 AM
ఖానాపూర్, మార్చి 6 (విజయ క్రాంతి): ఇటీవల ఉపాధి కోసమని, నిర్మల్ జిల్లా, ఖానాపూర్ నియోజకవర్గం కడం, దస్తురాబాద్, మండలాల గ్రామస్తులు ఆరుగురు, మలేషియా దేశం వెళ్లి ,అక్కడ అకారణంగా పోలీసు లకు ,చిక్కి శిక్ష అనుభవిస్తున్న వ్యక్తుల కుటుంబాలకు ,గురువారం బీఆర్‌ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఓదార్పునిచ్చాడు. ఈ నేపథ్యంలో, శిక్ష అనుభవిస్తున్న ఆరుగురు కుటుంబాలు ఖానాపూర్ లోని ఆయన క్యాంపు కార్యాలయంలో జాన్సన్ నాయక్ ను కలిశారు.
ఈ సందర్భంగా కుటుంబాలు కన్నీరు పెట్టుకున్నారు. ఆందోళన పడవలసిన అవసరం లేదని, తాను రెండు రోజులు మలేషియాలో మకాం వేసి ,అక్కడ పరిస్థితులను సమీక్షించానని, త్వరలోనే బాధితులు ఆరుగురుని తమ కుటుంబాలతో కలుపుతామని ,టిఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహాయంతో, అక్కడి అధికారులు, న్యాయవాదులతో మాట్లాడి, వచ్చానని, వారిని వారి కుటుంబాలతో చేర్చేంతవరకు గట్టి ప్రయత్నాలు చేస్తానని ,హామీ ఇచ్చారు.