బెంగళూరు: టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ పరుగుల దాహం తీరనిదని భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. ఒకటి, రెండు సిరీస్‌ల్లో విఫలమైనంత మాత్రాన అతడి ఫామ్‌ను జడ్జ్ చేయాల్సిన అవసరం లేదన్నాడు. ఒక స్టార్ బ్యాటర్ ఫామ్‌లోకి రావడానికి ఒక్క ఇన్నింగ్స్ చాలని గంభీర్ అభిప్రాయపడ్డాడు.
గంభీర్ మాట్లాడుతూ..‘కోహ్లీ విషయంలో నా ఆలోచనలు క్లియర్‌గా ఉన్నాయి. త్వరలో జరగనున్న కివీస్, ఆసీస్ సిరీస్‌ల్లో కోహ్లీ చాలా కీలకంగా మారనున్నాడు. కోహ్లీ ప్రపంచస్థాయి ఆటగాడు. ఎన్నో రోజుల నుంచి టన్నుల కొద్దీ పరుగులు చేస్తూ జట్టుకు కీలకంగా మారాడు. ఆరంగ్రేటం నుంచి ఇప్పటి వరకు కూడా కోహ్లీలో ఏ మాత్రం పరుగుల దాహం తగ్గలేదు.
అంతిమంగా జట్టుకు ఫలితాలు మెరుగ్గా వస్తున్నాయా? లేదా అనేదే ముఖ్యం’ అని గంభీర్ పేర్కొన్నాడు. కివీస్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు బుధవారం నుంచి బెంగళూరు వేదికగా ప్రారంభం కానుంది.