24-02-2025 12:00:00 AM
కూసుమంచి , ఫిబ్రవరి 23 (విజయ క్రాంతి): కూసుమంచి మండల కేంద్రంలోని నర్సింహులగూడెం ఎత్తిపోతల పథకం ఫేస్ 2 కింద సాగులో ఉన్న వరి పొలాలను మండల వ్యవసాయ అధికారినీ రామడుగు వాణి ఆదివారం సందర్శించారు. ఈ ప్రాంతంలో అక్కడక్కడ నీటి ఎద్దడి ఉన్న కారణంగా రైతులందరూ సమన్వయంతో నీటిని వినియోగించుకోవాలని, సాగునీటిని వృధా చేయవద్దని, రెండు, మూడు రోజుల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ఫేస్ 2 మరమ్మతులు పూర్తవుతాయని సమాచారం ఉందని రైతులకు తెలిపారు..
అలాగే రైతులు నీటిని అవసరానికి తగినట్టుగా వాడుకోవాలని, సాగునీటికి ఇబ్బంది ఉండబోదని తెలియజేశారు. నీటి పారుదల , వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో రైతులందరికీ నీటి విడుదల షెడ్యూల్ను తెలియపరుస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి గ్రామ రైతులు పాల్గొన్నారు.