09-04-2025 12:00:00 AM
స్టూడెంట్స్‌ను లైబ్రరీలో కూర్చోబెట్టిన యాజమాన్యం
మేడ్చల్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): ఫీజు చెల్లించలేదని ముగ్గు రు విద్యార్థులను స్కూలు యాజమాన్యం లైబ్రరీలో కూర్చోబెట్టిన ఉదంతం మేడ్చల్ జిల్లాలో జరిగింది. కీసర మండలం రాంపల్లిలోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో 3, 4వ తరగతులు చదువుతున్న గౌరిక్, మధుర గౌరీతో పాటు మరో విద్యార్థిని స్కూల్ ఫీజు చెల్లించలేదు. దీం తో వారిని మంగళవారం తరగతి గదిలో కాకుండా లైబ్రరీలో కూర్చోబెట్టారు.
ఈ విషయం తెలిసి తల్లిదం డ్రుల వచ్చి ప్రశ్నించగా యాజమా న్యం దురుసుగా మాట్లాడింది. తన కుమారుడి ఫీజు ఇప్పటి వరకు రూ. లక్ష చెల్లించానని, బకాయి కూడా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నానని ఓ విద్యార్థి తండ్రి శివప్రసాద్ చెప్పారు. అయినా పాఠశాల యాజమాన్యం ఇలా వ్యవహరించడం తగదన్నారు.