calender_icon.png 10 January, 2025 | 12:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెళ్లాలకు ఫ్లాష్‌బ్యాకులు చెప్పొద్దు

07-01-2025 12:00:00 AM

నిజామాబాద్ ఈవెంట్‌లో విక్టరీ వెంకటేశ్ 

విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చి్ర తం ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు స మర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను సోమవారం నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్ లో నిర్వహించారు. ఈ వేదికపై హీరో వెంకటేశ్ స్టేజ్‌పై డ్యాన్స్ చేసి అభిమానులను ఉర్రూతలూగించారు.

ఈ సందర్భం గా వెంకటేశ్ మాట్లాడుతూ.. “నిజామాబాద్‌లో ట్రైలర్ లాంచ్ జరగడం చాలా హ్యాపీ గా ఉంది. దిల్ రాజు, శిరీష్‌తో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. పెళ్లాలకు మీ ఫ్లా ష్ బ్యాకులు చెప్పొద్దు (నవ్వుతూ). సినిమా చూడండి. మామూలుగా ఉండదు” అన్నా రు. డైరెక్టర్ అనిల్ మాట్లాడుతూ.. ‘ఇది టిపికల్ జోనర్ సినిమా. సంక్రాంతికి మీ ఫ్యామిలీ అంతా కట్టకట్టుకొని థియేటర్లకు వచ్చేయండి.

కడుపుబ్బా నవ్వించి బయట కు పంపుతాం. థాంక్యూ నిజామాబాద్’ అ న్నారు. దిల్ రాజు మాట్లాడుతూ.. “1980లో ఇక్కడ రూపాయి టికెట్‌తో నే నూ, శిరీష్ సినిమాలు చూసేవాళ్లం. అలా సినిమాలపై ఇష్టం ఏర్పడింది. మా 58వ సినిమా ఈవెంట్ ఇక్కడ చేయడం మాకు చాలా గర్వంగా ఉంది. నిజామాబాద్‌లో ఇంతకు ముందు ‘ఫిదా’ వేడుక చేశాం.

పూర్తిస్థాయిలో ఓ సినిమా వేడుక నిజామాబాద్‌లో జరగడం ఇదే ఫస్ట్ టైమ్. ఎం తోమంది హీరోలు, దర్శకులు సపోర్ట్ చేస్తే ఈ స్థాయిలో ఉన్నాం. రామానాయుడు ని ర్మాతగా చరిత్ర సృష్టించారు. వెంకటేశ్ ‘కలియుగ పాండవులు’ ఫోటో చూసి ఆయ నకు ఫ్యాన్ అయ్యాను. వెంకటేశ్ ఉంటే ని ర్మాత సెట్‌లో ఉండాల్సిన అవసరం లేదు. ఆయనే అన్నీ చూసుకుంటారు” అని చె ప్పారు.

నిర్మాత శిరీష్ మాట్లాడుతూ.. ‘నే ను వేదికపై ఎప్పుడూ మాట్లాడను. మన నిజామాబాద్‌లో జరుతున్న వేడుక ఇది.. అందరికీ ధన్యవాదాలు చెప్పాల్సిన బాద్య త ఉంది’ అని తెలిపారు. ఎమ్మెల్యే ధన్‌పా ల్ సూర్యనారయణ గుప్తా మాట్లాడుతూ.. వెంకటేశ్ ఫ్యాన్ లేని ఫ్యామిలీ ఉండదు. దిల్ రాజు మా ఇందూరు వాసి అని చెప్ప డం గర్వంగా ఉంది’ అన్నారు. కార్యక్రమం లో యాక్టర్ డాక్టర్ నరేశ్ వీకే, హీరోయిన్లు ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి పాల్గొన్నారు.