calender_icon.png 12 March, 2025 | 10:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షుగర్‌ను లైట్ తీసుకోవద్దు

12-03-2025 12:23:19 AM

  1. నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ముప్పు
  2. వ్యాయామం, సరైన డైట్‌పాటిస్తే నో టెన్షన్
  3. ప్రముఖ వైద్యుడు, రిటైర్డ్ కల్నల్ మాచర్ల భిక్షపతి

జనగామ, మార్చి 11(విజయక్రాంతి): షుగర్(మధుమేహ) బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఒకప్పుడు వారస త్వంగా మాత్రమే ఈ వ్యాధి వస్తుండగా.. ప్రస్తుతమున్న ఆహార అలవాట్లకు అందరికీ షుగర్ అటాక్ అవుతోంది. అయితే, దీనిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ప్రమాదమని, వైద్యుల సలహాలు పాటిస్తూ ఆదిలోనే కంట్రోల్ చేసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

జనగామకు చెంది న ప్రముఖ వైద్యులు, రిటైర్డ్ కర్నల్ మాచర్ల భిక్షపతి ఆదివారం ‘షుగర్ వ్యాధి, తీసుకోవాల్సిన జాగ్రత్తల’పై పలు సూచనలు చేశారు. ఊబకాయం ఉన్నవారికి, ఎక్కువగా బేకరీ, హోటళ్లు, చిరుతిండి తినేవారికి ఈ వ్యాధి వస్తుందని చెప్పా రు. 2019 జనాభా లెక్కల ప్రకారం భా రతదేశంలో 77 మిలియన్ల షుగర్ వ్యాధిగ్రస్తులు ఉ న్నట్లు అధికారికంగా గుర్తించారు. దేశ సరిహద్దుల్లోనే 24.5 శాతం మంది షుగర్  వ్యా ధితో ప్రమాదకర స్థితలో ఉన్నట్లు తెలిపారు. 

విస్మరిస్తే తీవ్ర పరిణామాలు..

తీపి శ్వాస ఎక్కువగా రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, షుగర్ లెవల్స్ పడిపోవడం, పెరగడం వంటివి తాత్కాలిక మధుమేహ వ్యాధికి సూచికలని డాక్టర్ భిక్షపతి తెలిపారు. ఇలాంటప్పుడే జాగ్రత్త పడితే ఎలాంటి సమస్యలు ఉండబోవన్నారు. కానీ నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులుగా మారే ప్రమాదముందన్నారు.

పదేళ్లుగా వ్యాధి ఉంటే కాళ్లకు పుండ్లు, నరాలపై ప్రభావం పడుతుందన్నారు. పదేళ్లుగా పట్టించుకోకుంటే స్పర్శ కోల్పోవడం, గుండె జబ్బులు, కంటి రెటీనాపై ప్రభావం పడుతోందన్నారు. 15 నుంచి 20 సంవత్సరాలుగా షుగర్‌ను నిర్లక్ష్యం చేస్తే మతిమరుపు, ఆకస్మిక మరణాలు, మూత్రపిండాలు చెడిపో వడం వంటి ప్రమాదాలు ఉంటాయన్నారు. 

మూడు రకాలుగా..

షుగర్ వ్యాధి మూడు రకాలుగా ఉంటుందని డాక్టర్ భిక్షపతి పేర్కొన్నారు. పిల్లలకు టీ1 డీఎం, పెద్ద వారికి టీ2 డీఎం, గర్భిణులకు జీడీఎం షుగర్ సంభవిస్తుందని తెలిపారు. అత్యవసర పరీక్షలతోనే దీని నుంచి బయటపడొచ్చన్నారు. క్రమం తప్పకుండా టెస్టులు చేయించుకోవడం, తక్కువ ఆహారం తీసుకోవడం, ఎక్కువగా వ్యాయా మం చేయడం వల్ల షుగర్ ను కట్టడి చేయవచ్చని సూచించారు.  డాక్టర్ సలహాలు పా టిస్తూ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.