- అర్హులందరికీ ఇళ్లు కేటాయించండి
- అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 23 (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు సక్రమంగా అమలయ్యే లా అధికారులు కృషి చేయాలని గృహ నిర్మా ణ, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. ఇళ్ల కేటాయింపులో ఎవరి సిఫార్సులు పరిగణించవద్దని, అర్హులందరికీ ఇళ్లు కేటాయించాలని ఆదేశిం చారు.
శనివారం భద్రాచలంలో నిర్వహించిన నియోజకవర్గ అధికారుల సమా వేశంలో ఆయన పాల్గొన్నారు. శాఖలవారిగా ఏజెన్సీ మండలాల్లో సమస్యల గురిం చి సమీక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గిరిజన కుటుంబాలకు, గిరిజన రైతులకు, గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.
భద్రాచలంలో డంపింగ్ యార్డును 15 రోజుల్లో ప్రారంభించాలన్నారు. ఐటీడీఏ ఇంజనీరింగ్ ద్వారా చేపట్టిన రోడ్లు పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. భధ్రాచలం, పర్నశాలకు ఆర్‌డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ ద్వారా సక్రమంగా తాగునీరు సరఫరా జరగడం లేదని తన దృష్టికి వచ్చిందని వెంటనే గిరిజన ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
సమీక్ష సమావేశానికి ముందు భద్రా చలంలోని ఏఎంసీ కాలనీలో నిర్మాణం పూర్తయి ఖాళీగా ఉన్న ఇందిరమ్మ డబుల్ బెడ్ రూం ఇళ్లను మంత్రి పొంగులేటి పరిశీలించారు. ఆ ఇండ్లను గిరిజన లబ్ధిదారులను గుర్తించి అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేచేయాలని అధికారులను ఆదేశించారు.
ఏజెన్సీ ప్రాంతంలో టెండర్లు పూర్తయి సగం వరకు నిర్మాణం చేపట్టిన ఇళ్లు ఉంటే కలెక్టర్, పీవో ద్వారా అనుమతులు తీసుకుని పూర్తి చేయాలన్నారు. సంబంధిత ఈఈలు ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి డిసెంబర్ నాటికి లబ్ధిదారులందరికీ అందజేయాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ జితేష్ వి పాటిల్, పీవో రాహూల్ పాల్గొన్నారు.
రామాలయ అభివృద్ధికి కృషి
భద్రాచలం, నవంబర్ 23: భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన భద్రాచల రాములవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే రూ.70 కోట్లు మాడవీధుల అభివృద్ధికి విడుదల చేసినట్టు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులం ఉన్నామని, అందరం కలిసి రామాలయం అభివృద్ధిలో ముందుంటామన్నారు. ఆయవనెంట కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ ఉన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల కోసం గ్రామసభలు
ఖమ్మం, నవంబర్ 23 (విజయక్రాంతి): అర్హులందరికి ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని, అందుకోసం డిసెంబర్‌లో గ్రామసభలు నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివా స్‌రెడ్డి తెలిపారు. శనివారం పాలేరు నియోజకవర్గం పరిధిలోని ఖమ్మం రూరల్ మండలంలో మంత్రి పర్యటించారు. తెల్దారుపల్లి, మద్దులపల్లి, గుర్రాలపాడు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం ఇందిరమ్మ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. డిసెంబర్ మొదటి వారంలో గ్రామసభలు నిర్వహించి అర్హులకు పారదర్శకంగా ఇం డ్లు కేటాయిస్తామన్నారు.
ప్రతి కుటుంబానికి స్మార్ట్ కార్డు అందించి ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ హేమలత, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు పాల్గొన్నారు.