calender_icon.png 11 January, 2025 | 11:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక ఇబ్బందులతో చదువు ఆగిపోవద్దు

04-12-2024 02:38:18 AM

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ముగ్గురు ఎంబీబీఎస్ విద్యార్థులకు ఫీజులు చెల్లించిన మంత్రి

హైదరాబాద్, డిసెంబర్3 (విజయక్రాంతి): రాష్ర్టంలో ప్రతిభ కలిగిన ఏ నిరు పేద విద్యార్థి చదువులు ఆర్థిక ఇబ్బందులతో ఆగిపోకూడదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో చదువుకోలేకపోతున్నరనే విషయం తెలిస్తే తన హృదయం తల్లడిల్లిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా ఎలికట్టకు చెందిన గుండె యుగేందర్, వెలిమినేడు గ్రా మానికి చెందిన అంతటి శశిప్రకాశ్, గుండ్రంపల్లికి చెందిన రుద్రారపు కావేరి ఎంబీబీఎస్ సీట్లు సాధించినా ఆర్థిక సమస్యలతో చదువులు ఇబ్బందిగా మారాయనే విషయం తె లుసుకున్న మంత్రి.. ముగ్గురు విద్యార్థులను మంగళవారం హైదరాబాద్‌కు పిలిపించుకొని ఒక్కొక్కరికి రూ.65 వేల చొప్పున ఆర్థిక సహాయం చేశారు.

ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా వారి మొత్తం చదువుకు సంబంధించిన ఫీజులను చెల్లిస్తానని, చదువులకు అయ్యే ఇతర ఖర్చులు భరిస్తానని మంత్రి వారికి భరోసా కల్పించారు. బాగా చదువుకొని డాక్టర్లుగా పేదలకు సేవ చేసి మంచిపేరు సంపాదించుకోవాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మంత్రికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. 

 విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరం

ఇంటర్ కాలేజీల్లో విద్యార్థుల మరణాల పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీరియస్ అయ్యారు. పదిరోజుల్లో ముగ్గురు విద్యార్థు లు ఆత్మహత్యలు చేసుకోవడం దారుణమ న్నారు. ర్యాంకుల పేరిట విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేసే విధానాలను ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు మానుకోవాలని మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించా రు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న కా లేజీలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

విద్యార్థులు చెప్పు కోలేని, ఏదైన అత్యవసర సమస్య ఉంటే తన ఆఫీసు మొబైల్ నెంబర్ 8688007954 లేదా minister.randbc@gmail.com <mailto:minister.randbc@gmail.com> ఈమెయిల్ ద్వారా తెలియచేయాలని కోరారు.