calender_icon.png 26 October, 2024 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఒకే పొజిషన్‌లో కూర్చోవొద్దు!

21-05-2024 12:05:00 AM

బాడీ లాంగ్వేజ్, స్టులింగ్ విషయానికి వస్తే కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం విశ్వాసానికి చిహ్నంగా భావిస్తారు. ఈ విధంగా కూర్చోవడంలో చాలా సుఖంగా భావిస్తారు. మనలో చాలా మందికి కాలు మీద కాలు వేసుకొని కూర్చునే అలవాటు ఉంటుంది. కానీ ఈ అలవాటు శరీరానికి చాలా హాని కలిగిస్తుందని మీకు తెలుసా? అదే పొజిషన్‌లో ఎక్కువ సేపు కూర్చుం టే ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎక్కువ సేపు కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం వల్ల రక్తపోటు, వెరికోస్ వెయిట్స్ వంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

* కాలు మీద కాలు వేసుకొని కూర్చునే అలవాటు మీ ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం వల్ల పెల్విక్ ప్రాంతం ఎముకల అమరికలో సమస్యను పెంచుతుంది. కాళ్లకు రక్త ప్రసరణ తగ్గిపోతుంది. వెన్నుముక అమరిక దెబ్బతిని లోయర్ బ్యాక్ పెయిన్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. 

* బీపీ చెక్ చేస్తున్నప్పుడు డాక్టర్ రెండు పాదాలను నేలపై ఉంచమని చెబుతాడు. ఇది ఎందుకు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా. వాస్తవానికి రెండు పాదాలను నేలపై ఉంచడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

* కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం వల్ల రక్తప్రసరణ సరిగ్గా జరగక.. నడవలేని పరిస్థితికి దారితీస్తుంది. ఎక్కువ సమయం కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే వెన్నునొప్పి, మోకాలి నొప్పి, పాదాలలో తిమ్మరి వంటి సమస్యలు వస్తాయి. 

* గర్బిణీలు కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం అనేక సమస్యలకు కారణం అవుతుంది. గర్భదారణ సమయంలో కాలు మీద కాలు వేసుకుంటే తల్లితో పాటు బిడ్డకు హాని కలుగుతుంది. కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుల సమస్యలకు దారి తీస్తుంది.