calender_icon.png 5 November, 2024 | 4:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుక్క కాటు బాధితులకు పరిహారంతో సరిపెట్టొద్దు

03-07-2024 12:50:31 AM

హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): కుక్క కాటుతో చనిపోయిన పిల్లల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారమిచ్చి చేతులు దులిపేసుకోడానికి వీల్లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అనుపమ్ త్రిపాఠి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం ఉత్తర్వులను ఏమేరకు అమలు చేసిందీ చెప్పా లని ఉత్తర్వులు జారీచేసింది. వనస్థలిపురానికి చెందిన ఎంఈ విక్రమా దిత్య దీనిపై ప్రజాహిత వ్యాజ్యం వేశారు. బాగ్‌అంబర్‌పేటలో గత ఏడాది ఫిబ్రవరి 19న విద్యార్థిపై కుక్కలు దాడి చేయడంతో మరణించినట్టు పత్రికల్లో వచ్చిన వార్తను కూడా హైకోర్టు పిల్‌గా పరిగణించింది. వీటిపై సీజే జస్టిస్ అలో క్ ఆరాధే, జస్టిస్ జే అనిల్‌కుమార్ ధర్మాసనం మంగళవారం విచారిం చింది. పరిహారం చెల్లిస్తే సరిపోదని,  దాడుల నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సంతృప్తిగా లేవని వ్యాఖ్యానించింది. దీనిపై నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని, జాతీయ జంతు సంక్షేమ మండలిని ఆదేశించింది. ఈ నెల 10కి వాయిదా వేసింది.