22-04-2025 01:47:52 AM
ఏఎంసీ చైర్మన్ కవిత ప్రభాకర్ రెడ్డి
బిచ్కుంద, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని బిచ్కుంద మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సోమవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ఆదేశాల మేరకు మార్కెఫెడ్ ఆధ్వర్యంలో బిచ్కుంద మండల కేంద్రం లో జొన్న కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే జొన్నలను విక్రయించాలని కోరారు. క్వింటాలుకు ప్రభుత్వ మద్దతు ధర రూ.3,371 ఉంద న్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే జొన్నల ధాన్యాన్ని విక్రయించాల న్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి ప్రతి గింజ కొనుగోలు చేస్తుందని తెలిపారు.
అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ ను సొసైటీ చైర్మన్ నల్చర్ బాలు(శ్రీ హరి) ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో బిచ్కుంద మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత, ప్రభాకర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ నల్చర్ బాలు (శ్రీ హరి) సొసైటీ వైస్ చైర్మన్ యాదరావ్, రైతులు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.