calender_icon.png 2 November, 2024 | 6:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరంలో చెత్త నిల్వలు కనిపించొద్దు

31-07-2024 12:31:00 AM

జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశం

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 30 (విజయక్రాంతి): శానిటేషన్ సిబ్బంది, స్వచ్ఛ ఆటోల హాజరు శాతం మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట అధికారులను ఆదేశించారు. మంగళవారం అడిషనల్ కమి షనర్లు, జోనల్ కమిషనర్లతో ఆమె టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో ఎక్కడా చెత్త కనపడకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. డిప్యూటీ కమిషనర్లు, సహాయ వైద్యాధికారులు నిర్ధేశించిన సమయం ప్రకారం విధులకు హాజరు కావాలని సూచించారు. చెత్త,గ్రీన్ వేస్ట్, సీఅండ్‌డీ, భవన నిర్మాణ వ్యర్థా లు లేకుండా చూడాల్సిన బాధ్యత డీసీలు, సహాయ వైద్యాధికారులదేనన్నారు.