టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగిటి రాజు
కోనరావుపేట, జనవరి 22: రిటైర్మెంట్ వయసు పెంపు ఆర్థిక సమస్యలకు పరిష్కారం కాదని, పెన్షనర్ల చెల్లింపులు వాయిదా వేయడం కోసం ఉద్యోగ విరమణ వయస్సు పెంచాలని ప్రభుత్వ యోచన సరైంది కాదని, ఆ ప్రతిపాదన విరమిం చుకుని పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగిటి రాజు డిమాండ్ చేశారు.
మండల కేంద్రం లో జరిగిన సమావేశం లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. పిఆర్సీ నివేదికను వెంటనే తెప్పించి సంఘాలతో చర్చించి 2023 జులై 1 నుండి అమలు చేయాలని, బకాయి పడిన నాలుగు వాయి దాల కరువు భత్యాన్ని వెంటనే విడుదల చేయాలన్నారు.
కెజిబివి, యుఆర్‌ఎస్, ఆశ్రమ పాఠశాలల కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేలు ఇవ్వాలని, గురు కులాల పనివేళలు విద్యార్థులకు, ఉపాధ్యా యులకు అనుకూలంగా మార్చాలన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు గుండమనేని మహేం దర్ రావు, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మ్యాక వెంకటేశం, గాలిపెల్లి సంతోష్ పాల్గొన్నారు.
.