calender_icon.png 17 November, 2024 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లగచర్లలో ఫార్మా కంపెనీ పెట్టొద్దు

17-11-2024 12:05:22 AM

  1. అమాయకులపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తేయాలి
  2. లేదంటే ఢిల్లీ కేంద్రంగా నిరసనలు చేపడతాం 
  3. ఓయూ జేఏసీ నాయకులు మోతీలాల్ నాయక్

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 16 (విజయక్రాంతి): కాంగ్రెస్ అంటే ఇళ్లు కట్టించేదనీ, పేదలకు భూములు పంచుతుందనే నమ్మకం ప్రజల్లో ఉందని అలాంటి కాంగ్రెస్ పార్టీ.. నేడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేదల ఇళ్లను కూల్చుతూ.. అమాయక గిరిజనుల భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తుందని ఓయూ జేఏసీ నాయకులు మోతీలాల్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటు ప్రతిపాదనను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాం డ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద లగచర్లలో అమాయక గిరిజనులపై తప్పుడు కేసులు బనాయించి జైళ్లలో పెట్టిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా మోతీలాల్ మాట్లా డుతూ లగచర్లలో అమాయక లంబాడ గిరిజనులకు చెందిన భూములను బలవం తంగా తీసుకోవడాన్ని, భూములు ఇవ్వని వారిపై దౌర్జన్యానికి దిగడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. లగచర్లలో అమాయక గిరిజనులపై తప్పుడు కేసులు మోపుతూ తీవ్ర ఇబ్బందలుకు గురి చేస్తున్నారన్నారు. 

90 ఏళ్ల మహిళపై కూడా దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. ఫార్మా కంపెనీ యాజమానులపై అంత ప్రేమ ఉంటే ఉన్నత సామాజికవర్గానికి చెందిన భూములను తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఓయూ జేఏసీ నాయకులు వినోద్ నాయక్, అరుణ్ నాయక్, అనిల్ నాయక్, పీడీఎస్‌ఎఫ్ రాష్ట్ర నాయకులు కోట ఆనంద్ పాల్గొన్నారు.