- టికెట్లు బ్లాక్‌లో కొంటే ఆ డబ్బు ఎవరికో వెళ్తుంది
- టికెట్ ధరలు పెంచితే ప్రభుత్వానికే ఆదాయం
- హీరోలు ప్రభుత్వం దగ్గరకు రావాల్సిన అవసరంలేదు
- ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్
సినిమా ప్రతినిధి, జనవరి 4 (విజయక్రాంతి): టాలీవుడ్ స్టార్ రామ్‌చరణ్ కథా నాయకుడిగా నటించిన ‘గేమ్ చేంజర్’ సిని మా ఈ నెల 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ శని వారం రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్, పలువురు ఎమ్మెల్యేలు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సినిమా రంగానికి రాజకీయ రంగు పులమవద్దని సూచించా రు. సినిమా టికెట్ రేట్లు పెంచితే ప్రభుత్వానికే ఆదాయం వస్తుందని తెలిపారు. “తెలు గు సినిమాకు మూలాలైన పెద్దలను ఎప్పు డూ మర్చిపోలేం.
తెలుగు జాతి కీర్తి పెంచిన వారిని ఎప్పుడూ తలుచుకుంటాం. ఈరోజు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నా.. రామ్‌చరణ్ ఉన్నా.. దానికి కారణం చిరంజీవి. ఆయనే మా ఎదుగుదలకు ఆద్యుడు. రాజమౌళి, రామ్‌చరణ్, ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయికి వెళ్లా రు. అందుకు కారణమైన దక్షిణాది దర్శకు ల్లో శంకర్ ఒకరు.
ఇక దిల్ రాజు.. నేను బాగా కష్టాల్లో ఉన్నప్పుడు ‘వకీల్‌సాబ్’ సినిమా ఇచ్చారు. ఆయన ఇచ్చిన డబ్బే జనసేన పార్టీకి ఇంధనంగా మారింది. ‘గేమ్ చేం జర్’ ట్రైలర్ చూశాను. సామాజిక సందేశం ఇచ్చేలా ఉందనిపిస్తోంది” అని చెప్పారు.
పవన్ కళ్యాణ్ రియల్ గేమ్ చేంజర్: రామ్‌చరణ్
రామ్‌చరణ్ మాట్లాడుతూ.. “సినిమాలో నేను గేమ్ చేంజర్‌ని కావొచ్చు. కానీ ఈరోజు ఇండియన్ పాలిటిక్స్‌లో పవన్ కళ్యాణ్ రియల్ గేమ్ చేంజర్. పవన్ కళ్యాణ్ లాంటి వారిని చూసే శంకర్ ఇలాంటి పాత్రలను రాసి ఉంటారు’ అని చెప్పారు.
డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ.. ‘మినిస్టర్, కలెక్టర్‌కు జరిగే వార్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. హీరో ఫ్లాష్ బ్యాక్ అద్భుతంగా ఉంటుంది’ అని చెప్పారు. దిల్ రాజు మాట్లాడుతూ.. ‘శంకర్ ఈ కథను చెప్పిన మన రాష్ర్టంలో జరిగే ఎన్నో ఘటనలు గుర్తుకొచ్చాయి. మూడు డిఫరెంట్ పాత్రల్లో రామ్‌చరణ్ నటన అద్భుతంగా ఉండబోతోంది’ అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నటులు ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సంగీత దర్శకుడు తమన్, హీరోయిన్ అంజలి, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.
టికెట్ ధరల పెంపు ప్రభుత్వానికీ లాభమే..
పవన్ కల్యాణ్ ఇంకా మాట్లాడుతూ.. ‘సినిమా టికెట్లు బ్లాక్‌లో కొనుక్కొని చూస్తే ఆ డబ్బు ఎవరికో వెళ్తుంది. తెలుగు సినిమా స్థాయి పెరిగింది. బడ్జెట్ పెరిగిం ది. టికెట్ రేట్లు పెంచితే అది నిర్మాతలకు ఉపయోగపడుతుంది. టికెట్ రేట్లు డిమాండ్ అండ్ సప్లు మీద ఆధారపడి ఉంటుంది. ప్రతీ టికెట్ మీద జీఎస్టీ ఉం టుంది. పెంచిన ప్రతి రూపాయికీ పన్ను ఉంటుంది. అలా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.
సినిమాలు తీసినవారు, చిత్ర పరిశ్రమలో పనిచేసినవారే ఈ రంగం గురించి మాట్లాడాలి. టికెట్ రేట్లు పెంచే విషయమై సినీ హీరోలు ప్రభుత్వం దగ్గరకు రావాల్సిన అవసరంలేదు. సినిమా రంగానికి రాజకీయ రంగు పులమడం నాక్కూడా ఇష్టం ఉండదు. హాలీవుడ్‌ను అనుకరించడం కాకుండా మన మూలాల్ని పైకి తెచ్చేలా కథల్ని తీసుకురావాలి. విలువల్ని నేర్పించే చిత్రాలు మరి న్ని రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.